- 31-07-2009 :: 6 :15 pm
- మార్కెట్ రిపోర్ట్
లోక్ సభ లో ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జీ ఇన్సురన్సు రంగం లో ఆర్ధిక సంస్కరణలను చేపట్టే దిశ లో ప్రథమంగా LIC బిల్లు ని ప్రవేశ పెట్టటం తో నేడు మన మార్కెట్లు భారి గా లాభ పడ్డాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 282 పాయింట్లు పుంజుకుని 15,670 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 4,636 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.83 శాతం, నిఫ్టీ 1.42 శాతం మేరకు వృద్ధి చెందాయి.
మేము ఉదయం సూచించిన విధం గా నిన్నటి లాభాలను కొనసాగిస్తూ ఈ రోజు ఉదయం 61 పాయింట్లు పుంజుకుని 15,449 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్ లోనే సెన్సెక్స్ భారీగా లాభపడింది. జూన్ 16, 2008 తర్వాత తొలిసారిగా అత్యధిక మార్కుకు స్టాక్ మార్కెట్ చేరుకుంది.అంచనాలకు మించి కార్పొరేట్ సంస్థల లాభాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుండి వీచిన సానుకూల సంకేతాలు మరియు ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆసక్తిని కనబరచడం వంటి అంశాలు మార్కెట్ పుంజుకునేందుకు దోహదం చేశాయి. ఇన్సురన్సు బిల్లు ని లోక సభ లో ఆర్ధిక మంత్రి ప్రవేశ పెట్టటం తో మార్కెట్ల లో మరింత జోరు కనిపించింది . ఈ లాభాల ప్రక్రియలో ఈ రోజు సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడి 15,773 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. మధ్యాహ్నపు ట్రేడ్ తర్వాత కొంత ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన తగ్గుముఖం పట్టినా.. తిరిగి రికివరీ అయి లాభాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.17 % లాభ పడగా , స్మాల్ క్యాప్ మాత్రం కేవలం 0.03 % లాభాలాను నమోదు చేసింది.
నేటి ట్రేడింగ్ లో కేవలం రియాలిటీ ఇండెక్స్ 1.36 % నష్టపోగా మిగిలిన అన్ని ఇండెక్స్ లు లాభాలను సాధించటం విశేషం. నేడు FMCG 3.17 %, ఆయిల్ మరియు గ్యాస్ ఇండెక్స్ 2.65 % లాభ పడ్డాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో హిందాల్కో , టాటా మోటార్స్ 6.6 % చొప్పున లాభపడ్డాయి. కాగా నేడు టెలికాం రంగం స్టాకు లైన భారతి అయిర్ టెల్ 3.1 %, ఆర్ కాం 2.1% నష్టాలను చవిచూసాయి.
- మేము గత ఆదివారం " మార్కెట్ ముందు చూపు " శీర్షిక లో ఈ వారం మార్కెట్లు CONSOLIDATE అవుతాయని ముందే సూచించాము . ఇందుకు అనుగుణంగా మార్కెట్లు నడుచుకున్నాయి. ఎల్లుండి ఆదివారం కూడా ఎప్పటివిధం గానే మార్కెట్ ముందు చూపు ప్రచురించ నున్నాము. అలాగే రేపు "మార్కెట్ సమీక్ష " కూడా ప్రచురించ నున్నాము . -ఎడిటర్
- .