• 25-08-2009 :: 8am
  • మార్కెట్ నాడి

గత మూడు రోజులు గా లాభాల బాట లో నడుస్తున్న ప్రపంచ మార్కెట్లు నేడు కొంత ప్రాఫిట్ బుకింగ్ కి లోనవుతున్నాయి. వడ్డీ రేట్లు , ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ కాలం , తక్కువగా ఉండే అవకాశం ఉందని నిన్న రాత్రి అమెరికా మార్కెట్ల లో ఫైనాన్షియల్ స్టాకులు నష్టపోగా, నేడు జపాన్ మార్కెట్ల లో గత నాలుగు రోజుల పెరుగుదల కారణం గా స్టాకు ల p/e నిష్పత్తి పెరిగిపోవటం తో ప్రాఫిట్ బుకింగ్ కి గురిఅవుతున్నాయి.

మన మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి ఆసియా మార్కెట్ల లో సైతం ఇదే వైనం కనబడితే, మన ట్రేడింగ్ లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ కి లోనయ్యే అవకాశం ఉంది.

దేశం లో ఋతుపవనాలు ప్రభావం కొంతపుంజుకోవటం మన మార్కేట్లని సానుకూలం గా ప్రభావితం చేసే అంశం. విదేశీ సంస్థాగత మదుపర్లు నిన్న కొనుగోళ్ళ పై నిన్న కనపరిచిన ఆసక్తి నేడు కూడా కనపరిస్తే , మార్కెట్లు మరికొంత పుంజుకునే అవకాశం ఉంది. నేడు TATA MOTORS కౌంటర్ FII ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15629
  • అవరోధాలు : 15695-15769-15814-15995
  • మద్దత్తులు: 15568-15370-15169-15080