• 26-08-2009:: 6:15 pm
  • మార్కెట్ రిపోర్ట్

వరుసగా నేడు ఐదవ రోజు మార్కెట్లు లాభాల లో ముగిసాయి. దీనితో నిఫ్టీ 21 పాయింట్లు లాభం పడి 4681 వద్ద ముగియగా, సెన్సెక్స్ 81 పాయింట్లు లాభం పడి 15769 వద్ద ముగిసింది. నేటి ఉదయం మేము 15769 పాయింట్లు కీలక అవరోధం అని సూచించాము. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ సరిగ్గా అక్కడే ముగియటం విశేషం .

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.1 శాతం లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం 1.97శాతం వృద్ధి పొందింది.

నేడు ఐ.టి ఇండెక్స్ అత్యధికం గా 3.4 శాతం లాభ పడింది. ఇన్ఫోసిస్ స్టాకు ఈ వృద్ధికి తోడ్పడిందని చెప్పాలి. కాగా టెక్ ఇండెక్స్ నేడు 2.5 శాతం వృద్ధి చెందింది. నేడు FMCG, కన్సుమేర్ డ్యురబుల్స్ 1.01 %, 0.45% చొప్పున బల హీన పడ్డాయి.

సెన్సెక్స్ స్టాకు ల పరం గా INFOSYS, STERLITE 4.1 % , 3.9 % లాభాలను ఆర్జించ గా HUL, HDFC BANK 2.3 %, 1.8 % క్షీణించాయి.

  • 26-08-2009 :: 9 AM
  • మార్కెట్ నాడి

నిన్న అమెరికా లో ,బెన్‌ బెర్నాంకేను తిరిగి ఫెడ్‌ ఛైర్మన్‌గా ఒబామా నియమించనున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించడం మదుపరుల్లో విశ్వాసాన్ని పెంచింది. దీనికి తోడు కిందటి నెల 47.4 వద్ద ఉన్న అమెరికాలో వినియాగదారు విశ్వాస సూచీ అంచనాలను మించి ఈ నెలలో 54.1 శాతానికి ఎగబాకిన సమాచారం,అమెరికాలో గృహ ధరల సూచీ రెండో త్రైమాసికంలో 3% శాతం మేర వృద్ధి చెందినట్లు ఎస్‌ అండ్‌ పీ పేర్కొనడం వంటి అంశాలు అమెరికా మార్కెట్లను సానుకూలం గా ప్రభావితం చేసాయి. పైగా రానున్న పది సంవత్సరాల్లో రుణాలను ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి రెట్టింపునకు పెంచుకొనేందుకు సిద్ధమని ఒబామా ప్రకటించనున్నట్లు వార్త కూడా ప్రపంచ మార్కెట్లను సానుకూలం గా ప్రభావితం చేసే అంశం.

మన దేశ పరిస్థితి ని సమీక్షిస్తే , రుతుపవానాలు కరునించటం మదుపర్ల సెంటిమెంట్ కి బలం చేకూర్చ నున్నాయి. ఐతే నేడు ఆసియా మార్కెట్లు ఒడిదుడుకుల తో పయనిస్తుండటం వలన , మన మార్కెట్లు కూడా స్వల్పం గా ఆటు పోట్లకి గురి అయ్యే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15688
  • అవరోధాలు : 15695-15769-15814-15995
  • మద్దత్తులు: 15568-15370-15169-15080
  • 25-08-2009 :: 6:40 PM
  • మార్కెట్ రిపోర్ట్
బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపథ్యం లో నేడు మన మార్కెట్లు నష్టాల తో ప్రారంభ మైనప్పటికి విశేషమైన ప్రదర్శన కనబరుస్తూ స్వల్ప లాభాల తో ముగిసింది. దీనితో సెన్సెక్స్ 59 పాయింట్ల వృద్ధి పొంది 15688 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 16.5పాయింట్ల వద్ద ముగిసి 4659 పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది.
నేటి ఉదయం, మా అంచనాలకు అనుగుణం గా సెన్సెక్స్ సుమారు 50 పాయింట్ల నష్టం తో ఆరంభమై క్రమంగా నష్టపోతూ , 200 పాయింట్ల వరకు కోల్పోయి కనిష్టం గా 15423 పాయింట్ల వరకు చేరుకుంది. ఐతే మధ్యాన్నం విదేశీ సంస్థాగత మదుపర్ల తాజా కొనుగోళ్ళ తో , ట్రే డెర్ల షార్ట్ కవెరింగ్ ల తో మార్కెట్లు నష్టాన్ని పూరించు కున్నాయి. దీనితో సెన్సెక్స్ 59 పాయింట్ల స్వల్ప లాభం తో ఫ్లాట్ గా ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం లాభ పడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.50 శాతం లాభాలను ఆర్జించింది.
నేడు పి. ఎస్. యు ఇండెక్స్, బ్యాంకింగ్ ఇండెక్స్ ౦.4 %, 0.88% చొప్పున నష్టాలను చవిచూసాయి. కాగా ఐ.టి ఇండెక్స్ 1.92%, కన్సుమేర్ డ్యు రాబుల్స్ 1.80 % వృద్ధిని నమోదు చేసాయి.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు SBI, BHEL 2.4%, 1.8 % చొప్పున నష్టపోయాయి. కాగా విప్రో 3.9 % లాభపడింది. ఐతే నేడు TATA MOTORS అత్యధికం గా 7.1 % లాభపడింది. TATA MOTORS , నేడు FII దృష్టిని విశేషం గా ఆకర్షించ నున్నదని నేటి ఉదయమే మేము తెలియజేశాము . మా అంచనాలకు అనుగుణం గా TATA మోటార్స్ భారి గా లాభ పడటం విశేషం.