• 24-08-2009
  • మార్కెట్ రిపోర్ట్ :: 6:00 PM

సానుకూలమైన ప్రపంచ మార్కెట్ల మధ్య నేడు మన మార్కట్లు సుమారు 1 % గ్యాప్ అప్ తో శుభారంభం చేసాయి. ఆద్యంతం లాభాల బాట లో కొనసాగుతూ నేడు సెన్సెక్స్ 388 పాయింట్లు లాభపడి 15629 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 114 పాయింట్లు వృద్ధి చెంది 4643 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 2.55 శాతం లాభ పడగా , నిఫ్టీ 2.52 శాతం లాభ పడింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.61 శాతం , స్మాల్ క్యాప్ రంగం 2.83 శాతం వృద్ధి చెందాయి.

నేడు కూడా గత శుక్రవారం లాగానే అన్ని రంగాలు లాభాల బాట లో నడిచాయి. నేటి ట్రేడింగ్ లో రియాలిటీ ఇండెక్స్ అత్యధికం గా 5.09 శాతం వృద్ధి చెందటం విశేషం. కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ 3.59 శాతం లాభ పడింది.

ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేటి ట్రేడింగ్ లో TATA MOTORS 5.8 %, JP ASSOCIATES 5.5 % వృద్ధిని నమోదు చేసాయి.