21-08-2009::8 am

మార్కెట్ నాడి

జనవరి 2008 తరువాత అత్యధికం గా ఆగష్టు 3 వ వారం , ఆసియా మార్కెట్ల నుండి ఈక్విటీ ఫండ్స్ లో విదేశీ పెట్టుబడిదారులు తమ ముదుపు ను ఉపసంహరించారని వెల్లడి కావటం, జపాన్ ఆటో పరిశ్రమకి అమెరికా లో కార్ల మార్పిడి పై లభించే సబ్సిడీ ( clunker విధానం) ని రద్దు చేయడం తో , నేడు ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదురు కుంటున్నాయి. ఐతే గత రాత్రి అమెరికా లో AIG సంస్థ ,తమకు లభించిన బెయిల్ అవుట్ ప్యాకేజి సొమ్మును, ప్రభుత్వానికి తిరిగి చెల్లించి వేస్తామని చేసిన ప్రకటన ఆర్ధిక మాంద్యం తగ్గుముఖం పడుతున్న సూచన గా పరిగణించి , S & P, Nasdaq, Dowjones లాభాల బాట లో నడిచాయి. ఈ మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ నేడు మన మార్కెట్లు మరొక సారి ప్రాప్రంభం కానున్నాయి.

ఋతు పవనాలు కొంత పుంజుకోవటం తో దేశం లో ని వ్యవసాయ రంగానికి స్వల్ప ఉపశమనం లభ్యం కావటం మార్కెట్లకు కొంత సానుకూల అంశం.

పై అంశాల ప్రభావం వలన మార్కెట్లు లాభాల తో ప్రారంభమైనా , నేడు వారాంతం కనుక , చివర లో కొంత అమ్మకాల వత్తిడి ని ఎదురుకునే ఆస్కారం ఉంది.

టెక్నికల్ గా చార్టులను పరిశీలిస్తే, నేడు మార్కెట్ లో కొంత బలహీనత కనిపించే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15012
  • అవరోధాలు: 15080 -15169-15370-15446
  • మద్దత్తులు ::14930-14888-14780