- 20-08-2009 :: 6 : 15pm
- మార్కెట్ రిపోర్ట్
సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపథ్యం లో నేడు మన మార్కెట్లు లాభ పడ్డాయి. దీనితో బొంబాయి సెన్సెక్స్ 202 పాయింట్లు లాభ పడి 15012 వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లు లాభ పడి 4453 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.37 శాతం, నిఫ్టీ 1.35 శాతం మేరకు వృద్ధి చెందాయి.
ఉదయం 14930 పాయింట్ల అతి కీలక మద్దత్తు స్థాయి వద్ద ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం నిలకడగా పయనించాయి. ఒక స్థాయి లో 335 పాయింట్లు ఎగబాకి గరిష్టం గా 15145 పాయింట్ల వరకు చేరుకుంది . నేడు ఆగష్టు 8 కి చెందిన ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అయ్యాయి. ఈ సరి కూడా 1.53 శాతం దగ్గుదలని కనపరుస్తూ గడిచిన మూడు దశాబ్దాల లో అత్యంత సుదీర్ఘ తగ్గుదల గా రికార్డు ని సృష్టించింది. ఐతే మును ముందు ఈ ద్రవ్యోల్బణం అతి తీవ్ర స్థాయి లో పెరగనున్నదని రిజర్వు బ్యాంక్ గవర్నెర్ దువ్వూరి సుబ్బా రావు ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. ఈ నేపధ్యం లో sensex చివరికి 202 పాయింట్ల లాభం తో 15012 పాయింట్ల వద్ద ముగిసింది
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు సుమారు ౦.8 శాతం లాభ పడ్డాయి. నేటి త్రద్న్గ్ లో అన్ని రంగాలు లాభ పడటం విశేషం. నేడు ఆటో ఇండెక్స్ అత్యదికం గా 2.60% వృద్ధిని నమోదు చేసింది. కాగా బ్యాంకింగ్ రంగం 1.85 % లాభాలను అర్జించింది.
నేటి సెన్సెక్స్ స్టాకు ల లో MARUTI , MNM 4.9%, 4.5 % లాభ పడగా, MTN తో ఒప్పందం అంత తేలిక గా కాదని తేలిపోవటం తో BHARTI AIRTEL 1.2 % క్షీణించింది.