• 20-08-2009 :: 8 :40 AM
  • మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల నుండి అనూహ్యం గా బయటపడి ఫ్లాట్ గా ముగియటం, నేటి ఆసియా మార్కెట్లు ఒడిదుడుకుల తో స్వల్ప లాభాల తో పయనించటం వంటి అంశాలు పరిశీలిస్తే, నేడు మన మార్కెట్లు దిశా హీనం గా పయనించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
నేడు ద్రవ్యోల్బణ ఫలితాలు విడుదల కానున్నందున ఈ అంశం మన మార్కెట్లను , మధ్యాన్నం తదుపరి కొద్దిగా ప్రభావితం చేయనున్నది. ఈ సందర్భం లో నిన్న RBI , ఆహార శాఖ మంత్రి వేరు వేరు సందర్భాలలో పెరగనున్న ఆహార ధాన్యాల ధరల అంశం గురించి చేసిన ప్రస్తావన ప్రాముఖ్యత సంత రించు కొనున్నది. రానున్న రోజులలో నిత్యావసరాల ధరలు పెరగనున్నాయన్న హెచ్చరిక మన మార్కెట్లను ప్రతికూలం గా ప్రభావితం చేసే అంశం.
టెక్నికల్ గా మార్కెట్లు అతి కీలక మద్దత్తు స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం వలన నేడు సెన్సెక్స్ 14780 పాయింట్ల మద్దత్తు సహాయం తో కొంత పెరిగే అవకాశం ఉంది. మధ్యాన్నం తదుపరి కొంత అటుపోట్లకి గురి అయ్యే అవకాశం లేకపోలేదు.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14810
  • మద్దత్తులు :14780- 14665-14530- 14428
  • అవరోధాలు : 14888-14930-15020