- 19-08-2009 :: 6:30 PM
- మార్కెట్ రిపోర్ట్
స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 226 పాయింట్లు కోల్పోయి 14,810 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 4,394 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.50 శాతం, నిఫ్టీ 1.45 శాతం మేరకు క్షీణించాయి.నిన్న 250 పాయింట్ల లాభాలతో ముగిసిన అనంతరం ఈ రోజు ఉదయం వాటిని కొనసాగిస్తూ.. 44 పాయింట్లు పుంజుకుని 15,079 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో లాభాల్లోనే కొనసాగినా... ఆసియా మార్కెట్ల నుంచి వీచిన బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు క్షీణించాయి.ఆటో, రియాల్టీ, మెటల్, ఇంధన స్టాకుల్లో భారీ స్థాయిలో సాగిన విక్రయాలు స్టాక్ మార్కెట్‌ను మరింతగా నష్టాల్లోకి జారుకునేలా చేసింది. నేడు చైనా , హంగ్ కాంగ్ మార్కెట్లు ఒక్క సారిగా కుప్ప కూలాయి. దీనితో సెన్సెక్స్ 413 పాయింట్లు క్షీణించి 14,684 వద్దకు కనిష్ఠంగా స్టాక్ మార్కెట్ పడిపోయింది.అయితే మధ్యాహ్నపు ట్రేడ్‌ల నుంచి ఇండెక్స్ రికవరీ అయింది. కనిష్ఠ స్థాయిల నుంచి కొంత వరకు పుంజుకోగలిగింది. మేము ఉదయం సూచించిన కీలక మద్దత్తు స్థాయి ఐన 14780 పాయింట్ల వద్ద బుల్ల్స్ మరల పుంజుకొని , భల్లూకల ( bears) వీరంగాన్ని ఆపాయి.
బ్యాంకింగ్, రియాల్టీ, ఐటీ స్టాకుల్లో ఎంపిక చేసుకున్న షేర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కొంత వరకు రికవరీ అయింది. అయితే స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కొద్ది సేపు ముందు ఇన్వెస్టర్లు లాభార్జన కోసం విక్రయాలను చేశారు. చివరకి సెన్సెక్స్ 14810 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 % మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14 % నష్టపోయాయి.
అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్ 2.68% శాతం, మెటల్ (లోహ), ఆటో, విద్యుత్, ప్రభుత్వం రంగ విభాగం, రియాల్టీ, టెక్, ఐటీ స్టాకులు 1 నుంచి 2 శాతం మేరకు నష్టపోయాయి.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు ACC, REL.INFRA 5.1%, 4.9 % మేరకు నష్టపోయాయి. కాగా HDFC, HDFC BANK 1.6%, 0.4 % లాభాలను నమోదు చేసాయి.