• 17-07-2009 :: 6 :30 pm

  • మార్కెట్ రిపోర్ట్

నేడు మార్కెట్లు ప్రభుత్వం ప్రకటించ నున్న ఆర్ధిక సంస్కరణల నేపథ్యం లో భారి గా లాభ పడ్డాయి. నేటి మార్కెట్ లో సెన్సెక్స్ 495 పాయింట్లు లాభ పడి 14745 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ నేడు 143 .55 పాయింట్లు వృద్ధిని నమోదు చేసిందింది. నిఫ్టీ 3.39 % లాభ పడి 4375 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ 3 .47 % వృద్ధిని సాధించింది.
ఆర్ధిక శాఖ కార్యదర్శి నేడు ఇన్సురన్సు రంగం లో విదేశీ పెట్టుపడులను పెంచే ప్రపాదన ఉన్నట్లు తెలియ చేయటం ప్రైవేటు బ్యాంకులలో విదీశీయులకు సైతం సమాన వోటు హక్కు కల్పించటం వంటి చర్యలు చేపట్ట నున్నటు చేసిన ప్రకటన తో నేడు మార్కెట్ లో మడుపర్ల లో విశ్వాసం బలపడింది. దీనితో కొనుగోళ్ళు జోరందుకున్నాయి. మధ్యాన్నం ట్రేడ్ లో సైతం ఐరోపా మార్కెట్లు లాభాల బాట లో పయనిస్తూండటం తో మన మార్కెట్లు మరింత గా పుంజుకున్నాయి.
వాతావరణ శాఖ వర్షం గురించి ఇచ్చిన భరోసా కూడా మార్కెట్ల లో ఉత్సాహాన్ని నింపాయి. దీని తో నేటి ట్రేడింగ్ లో బుల్ల్స్ తమ ఆధిపత్యాన్ని పూర్తి గా చాటుకున్నాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.31 % , స్మాల్ క్యాప్ రంగం 2.44 % వృద్ధిని నమోదు చేసాయి.
సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఆటో 5.16 % , బ్యాంకింగ్ 4.76 % , ఐ. టి 4 .11 % వరకు పుంజుకున్నాయి. నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలు లాభాలను ఆర్జించటం విశేషం.
ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే రిలయన్స్ ఇన్ఫ్రా 8.44 % వృద్ధిని నమోదు చేయగా , MNM 8.07% లాభ పడింది. కాగా నేడు కూడా Sterlite Industries నష్టపోయింది. నేడు ఈ స్టాకు ౦. 42 % స్వల్పం గా క్షీణించింది. దీనికి NTPC నష్టాల లో తోడూ గా ఉండి ౦. 15 % క్షీణించింది.
ప్రతీ వారం లాగే, రేపు కూడా ఈ వారం సమీక్ష ని ప్రచూరించనున్నాము. ఆది వారం మార్కెట్ ముందు చూపు శీర్షిక లో వచ్చే వారం పై టెక్నికల్ అనాలిసిస్ కూడా తప్పక చదవ గలరు.
  • మేము సలహా పేజి లో సూచించిన సూచనలు మా పాఠకులకు ఈ సారి గూడా లాభాల పంట పండిం చిందని మాకు అందరి నుండి e-mails అందుతున్నాయి. మీరందరూ మా పై చూపుతున్న అభిమానం ఇలాగే కొనసాగించ వలసినది గా కోరుతున్నాము. మీరు లాభ పడినట్లే , మీ మిత్రులు కూడా లాభ పడే విధం గా ఈ వెబ్సైటు గురించి మీ సన్నిహితులకు తెలియచేయగలరని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. -- Editor
.........................................................................................................................