• 17-07-2009 :: 8 am

  • మార్కెట్ నాడి
ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణ విషయం లో ఒకటి రెండు రోజులలో ప్రకటన చేయవచ్చన్న అంశం నేడు మార్కెట్ల లో కీలక అంశం కానున్నది. ఇప్పటి కే 90% కంటే అధికం గా ప్రభుత్వ వాటా కలిగిన సంస్థ ల లో ముందుగా సంస్కరణ విధానాలు అమలు జరపనున్నట్లు వార్త. కాబట్టి నేడు NMDC, MMTC, EIL మున్నగు ప్రభుత్వ రంగ వాటాల లో కొంత జోరు కనిపించే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన మార్కెట్లు కూడా కొంత లాభ పడే అవకాశం లేక పోలేదు. నిన్న రాత్రి , అమెరికా ఈ సంవత్సర చివరి కి ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడే అవకాశం ఉందని అంచనాల వలన అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా లాభ పడ్డాయి. ఈ అంశం కూడా మన మార్కెట్లకి సహకరించ నున్నది.
ఐతే నేటి ఉదయం ఆసియా మార్కెట్లు మంద కోడిగా పయనిస్తున్నాయి. వారం చివర కాబట్టి నిన్న ఇరుక్కుపోయిన ట్రేడేర్లు , నేడు మార్కెట్ పెరిగితే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. కావున ప్రాఫిట్ బూకింగ్ కొనసాగే అవకాశం ఉంది. నేడు మార్కెట్లు ఒడిదుడుకుల తో పయనం సాగించ వచ్చు.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14250
  • మద్దత్తులు : 14243- 14040-13886
  • అవరోధాలు : 14428-14534-14665

  • ..................................................................................................