18-07-2009
మార్కెట్ సమీక్ష
( 13-07-2009 నుండి 17-07-2009)
ఈ వారం ,ఆర్ధిక శాఖ ప్రకటించిన సంస్కరణల అంశాలు, సింగపూర్ ఆర్థిక మాంద్యం నుండి బయట పడిందన్న వార్త, వాతావరణ శాఖ ఋతుపవనాల పై ఇచ్చిన భరోసా మున్నగు అంశాల తో, మార్కెట్లు భారి గా లాభాలను ఆర్జించాయి.
దీనితో మన మార్కెట్లు ఏకంగా 9.2 % ఎగబాకి గత ఏడువారాల గరిష్ట లాభాలను నమోదు చేసాయి. వచ్చేవారం మార్కెట్లు కనపరిచిన మార్కెట్లు వలన గత వారం చవిచూసిన నష్టాలను పూరించుకో గలగటం విశేషం.
రోజు వారిగా మన మార్కెట్ల ప్రస్థానం ఈ విధం గా ఉండింది.
సోమవారం :
మార్కెట్లు ఉదయం నుండి నష్టాల లో పయనించాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 13,400 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 4వేల మార్కుకు దిగువున 3,974 వద్ద ముగిసింది.మిడ్ క్యాప్ రంగం 2.84 % క్షీనించ గా , స్మాల్ క్యాప్ రంగం 3.38 % నష్టపోయింది.
మంగళవారం :
నేడు మన మార్కెట్లు భారి గా లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 453 పాయింట్ల లాభం పొంది 13853 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 137 పాయింట్ల లాభాలను ఆర్జించి 4111 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల నుండి బలమైన సంకేతాల సహాయం వలన మన మార్కెట్లు లాభాలను ఆర్జించాయి.మార్కెట్ లో కొంత షార్ట్ కవెరింగ్ కూడా చోటు చేసుకోవటం వలన బుల్ల్స్ ,మార్కెట్ పై తమ ఆధిపత్యాన్ని చాటాయి. ఒక దశ లో సెన్సెక్స్ 500 పాయింట్ల పై చిలుకు లాభపడటం విశేషం.నీటి మార్కెట్ లో మిడ్ క్యాప్ రంగం 4.27 % లాభ పొందగా , స్మాల్ క్యాప్ రంగం 4.4 % వృద్ధిని సాధించింది
బుధ వారం :
బుధ వారం మన మార్కెట్లు మరొక సారి అద్భుతం గా రాణించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లు పుంజుకుని 14,253 వద్ద నిలిచింది. ఇది మేము ఉదయం సూచించిన 14243 పాయింట్ల కీలక మజిలీకి అత్యంత సమీపని గుర్తించాలి. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 4,234 వద్ద ముగిసింది.
ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 4.2 %, స్మాల్ క్యాప్ రంగం 4.6 % వృద్ధిని సాధించాయి
గురు వారం :
సెన్సెక్స్ 0.02 శాతం, నిఫ్టీ 0.05 శాతం మేరకు క్షీణించాయి.వరుసగా రెండు రోజులు లాభాల బాటన నడిచి 850 పాయింట్లు బలపడ్డ స్టాక్ మార్కెట్.. గురవారం మాత్రం లాభార్జన కోసం సాగిన క్రయవిక్రయాల్లో నష్టాలను చవిచూసింది. చివరకు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి.గురువారం జూలై 4 తాలూకు ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల అయ్యాయి.ప్రతి ద్రవ్యోల్బణం 1.21% గా నమోదయ్యింది గత వారం ఇది 1.55% గా నమోదు అయ్యింది. ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.24 % , స్మాల్ క్యాప్ రంగం 0.39% వృద్ధిని సాధించాయి.
శుక్రవారం :
ప్రభుత్వం ప్రకటించ నున్న ఆర్ధిక సంస్కరణల నేపథ్యం లో భారి గా లాభ పడ్డాయి. సెన్సెక్స్ 495 పాయింట్లు లాభ పడి 14745 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ నేడు 143 .55 పాయింట్లు వృద్ధిని నమోదు చేసిందింది. నిఫ్టీ 3.39 % లాభ పడి 4375 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 3 .47 % వృద్ధిని సాధించింది. ఆర్ధిక శాఖ కార్యదర్శి ఇన్సురన్సు రంగం లో విదేశీ పెట్టుపడులను పెంచే ప్రపాదన ఉన్నట్లు తెలియ చేయటం ప్రైవేటు బ్యాంకులలో విదీశీయులకు సైతం సమాన వోటు హక్కు కల్పించటం వంటి చర్యలు చేపట్ట నున్నటు చేసిన ప్రకటన తో మార్కెట్ మదుపర్లలో విశ్వాసం బలపడింది. ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.31 % , స్మాల్ క్యాప్ రంగం 2.44 % వృద్ధిని నమోదు చేసాయి.
ఈ వారం లో రియాలిటీ రంగం అధ్యధికం గా 17.6 % వృద్ధిని నమోదు చేయటం విశేషం. కాగా బ్యాంకింగ్ రంగం 11.1 % వృద్ధిని సాధించింది.
స్టాకు ల వారిగా పరిశీలిస్తే ఈ వారం Bajaj Auto అద్త్యధికం గా 11.40 % లాభాలను ఆర్జించింది. RCOM 10 % , SUZLON 9.98 %, BHEL 9.63 %, ICICI,PNB, SUN PHARMA, SATYAM SATYAM, TATA MOTORS, RELIANCE, HCL 8% ~ 9% వరకు లాభాలను ఆర్జించాయి.
ఈ వారం నష్ట పోయిన వాటా ల లో DR. REDDY 5.65 %, HUL 0.43 % తమ పేర్లను నమోదు చేసుకున్నాయి.
ఆది వారం మార్కెట్ ముందు చూపు శీర్షిక లో వచ్చే వారం పై టెక్నికల్ అనాలిసిస్ కూడా తప్పక చదవ గలరు.
.....................................................................................................