• 28-07-2009 :: 6 : 15 PM
  • మార్కెట్ రిపోర్ట్
ప్రధాన కంపెనీల షేర్లలో విక్రయాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 43 పాయింట్లు కోల్పోయి 15,332 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 4,564 వద్ద పయనిస్తోంది.నిన్న ఒడిదుడుకుల మధ్య ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54 పాయింట్లు లాభంతో 15,429 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ స్వల్ప నష్టాలను చవిచూసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుండి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ తిరిగి లాభాల గాడిన పడింది.
కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లపై సమీక్ష నేపథంలో బ్యాంకింగ్ రంగ స్టాకులు బలహీనపడ్డాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ రెడ్ మార్కులోకి ప్రవేశించింది. ఆర్‌బీఐ కీలకరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే మా అంచనాలకి అనుగుణం గా నే దీని ప్రభావం మార్కెట్లపై ఏ మాత్రం పడలేదు.
మేము ఉదయమే , ప్రభుత్వం తాజా ఉద్ధీపనలు కొనసాగిస్తూ , పన్ను రాయితీలు ప్రకటించిందని తెలియజేశాము. ఈ విషయం ఆలస్యం గా మార్కెట్లు తెలుసుకున్నాయి. దీనితో , మధ్యాన్నం నుండి రియాల్టీ రంగంలో తాజాగా కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. . టాటా మోటార్స్ మరియు ఇతర ఆటో స్టాకులు కూడా మధ్యాన్నం నుండి లాభం పడటం ప్రారంభించాయి. ఈ సహాయంతో ఇండెక్స్ పుంజుకుంది. దీంతో సెన్సెక్స్ గరిష్ఠంగా 22 పాయింట్లు లాభపడి 15,463 వద్దకు చేరుకుంది.ఈ తరుణంలో అంచనాలు అందుకోలేని హిందుస్థాన్ యునిలివర్ లాభాలు.. రిలయన్స్, ఇన్ఫోసిస్‌లు బలహీనపడటం వెరసి స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. చివరి సెన్సెక్స్ 15,332 వద్ద ముగిసింది. ఒక్క రిలయన్స్, హిందుస్థాన్ యునిలివర్, ఇన్ఫోసిస్‌ల వల్లే సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయింది.అలాగే ఐటీసీ షేర్లతో ఇండెక్స్ 10 పాయింట్లు లాభపడింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్క్యాప్ రంగం 1.1 % , స్మాల్ క్యాప్ రంగం 1.7 % వృద్ధి చెందాయి. నేడు బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 5 శాతం వృద్ధి చెందగా.. బీఎస్ఈ బ్యాంకెక్స్, ఎఫ్‌సీఎంజీ ఇండెక్స్‌లు 1 శాతం నష్టపోయాయి.
ఇక సెన్సెక్స్ స్టాకు ల వారిగా పరిశీలిస్తే , నేడు టాటా మోటార్స్ అత్యధికం గా 10.5 % లాభాలను నమోదు చేసింది. ఈ కౌంటర్ గురించి మేము ఉదయమే , సలహా పేజి లో ప్రస్తావించటం జరిగిందన్న విషయం గమనార్హం. నేడు రిలయన్స్ ఇన్ఫ్రా 3.9% లాభాలను నమోదు చేసి రెండవ స్థానం లో నిలిచింది. కాగా HUL 7.3%, ICICI BANK 2.4 % అత్యధికం గా నష్టపోయిన స్టాకులు గా నిలిచాయి.
  • .