28-07-2009 :: 8 am
మార్కెట్ నాడి
నిన్న పార్లమెంటు లో బడ్జెట్ ని ఆమోదిస్తూ చేసిన తీర్మానాల సందర్భం గా ఆర్ధిక మంత్రి నిర్మాణ రంగానికి, రోడ్లు మౌలిక రంగ అభివృద్ది కి , రియల్ ఎస్టేట్ రంగానికి గాను మరిన్ని పన్ను రాయితీలు ప్రకటించారు. ముఖ్యం గా చిన్ని పట్టణాల లో ప్రాజెక్ట్లు చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపనీలకి ఈ అంశం మరింత లాభాన్ని చేకూర్చ నున్నది. గతం లో ప్రకటించిన ప్యాకేజీలకు అదనం గా ఈ రాయితీలు ప్రకటించటం తో , నేడు మార్కెట్ల లో ఈ అంశం పై కొంత ఉత్సాహం చోటు చేసుకోనున్నది.
నేడు రిజర్వు బ్యాంక్ త్రైమాసిక పరపతి సమీక్షించ నున్నది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ప్రస్తుతం వ్యతిరేక దిశలో ఉన్న ద్రవ్యోల్బణం పెరిగే షవకాశాలున్నాయని తెలిపింది. కమడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, ద్రవ్య విధానం సరళతరం కావడం, ఆర్థిక విధానాల్లో మరింత స్పష్టత రావడం కారణంగా వచ్చే రెండు మూడు నెలల్లో ద్రవ్యోల్బణం 2 శాతం వరకూ చేరవచ్చని అంచనాలు . రుతుపవనాల ప్రభావం మరీ అసంతృప్తికరంగా లేక పోవటం కూడా వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉంది .
ఈ అంచనాల నేపథ్యం లో ప్రస్తుతం బ్యాంకులు అవలంభిస్తున్న రేపో , సి. ఆర్. ఆర్ , రివెర్స్ రేపో ల లో మార్పు ఉండక పోవచ్చు. ఈ అంచనాలకి అతీతం గా RBI వ్యవహరిస్తే ,ఈ అంశం నేడు బ్యాంకింగ్ స్టాకు లను ప్రభావితం చేయవచ్చు.
ప్రపంచ మార్కెట్ల తీరు ని గమనిస్తే , గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా ఫ్లాట్ గా ముగిసాయి. ఐతే అమెరికా లో నూతన గృహ అమ్మకాల లో 11 % వృద్ధిని నమోదు చేయటం విశేషం. నేడు ఆసియా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల తో మిశ్రమంగా పయనిస్తున్నాయి. ఈ అంశాలన్నీ కూడా మన మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ఈ అంశాలే కాక మార్కెట్లు కంపనీల ఫలితాల పై కూడా దృష్టి సారించ నున్నాయి . లాభాలు ప్రకటించిన కంపనీలు నేడు మార్కెట్ లో సంచలనం సృష్టించ నున్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 15375
- మద్దత్తులు :15169- 15080-14930
- అవరోధాలు : 15542-15661-15814