- 29-07-2009 :: 8 am
- మార్కెట్ నాడి
క్రెడిట్ సుస్సీ ఏజెన్సీ , వచ్చే సంవత్సరం లోపల సెన్సెక్స్ నకు 17000 పాయింట్ల టార్గెట్ గా ప్రకటించటం నేడు మన మార్కేట్లని కొంత ఉత్సాహ పరచ నున్నది. జూన్ 2010 లోపల సెన్సెక్స్ ఈ టార్గెట్ చేరుకుంటుందని జ్యోస్యం చెప్పింది. ఐతే, రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధానం లో మార్పు తెచ్చి , వడ్డీ రేట్లను పెంచే అవకాశం ముందు ముందు ఉందని , అప్పుడు, సెన్సెక్స్ సుమారు 15 % నుండి 20 % దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. దిద్దుబాటుకి , ఈ సంవత్సారంతానికి లోనయినా, ప్రభుత్వం చేపట్టే సంస్కరణల విధానం వలన, ఇండియా సాధించ నున్న GDP వృద్ధి వలన మరల పుంజుకుంటుందని ప్రకటించారు.
నిన్న ఆర్ధిక మంత్రి , ప్రభుత్వ రంగ సంస్థల లో ఆర్ధిక సంస్కరణలు చేపట్ట నున్నట్లు ప్రకటించారు ( ఆర్ధిక మంత్రి ప్రకటన వివరాల కై మార్కెట్ ఫోకస్ పేజిని చూడ గలరు ) .
ఈ అంశాలు మార్కెట్ లో బుల్ల్స్ కి చేయూత నివ్వనున్నది.
ఐతే , ప్రపంచ మార్కెట్లు గత రెండు రోజులు గా తీవ్ర ఒడి దుడుకుల కు లోనవుతున్నాయి. వీటి ప్రభావం మన మార్కెట్ల పై గత రెండు రోజులు గా మనం గమనిస్తూ నే ఉన్నాము. నేడు కూడా ప్రపంచ మార్కెట్లు మన మార్కెట్ల పై ఇదే రీతి న ప్రభావం చూపించ నున్నాయి. ఐతే రేపు F & O ముగింపు వలన మార్కెట్ లో షార్ట్ కవేరింగ్ అవకాశం లేక పోలేదు. ఈ అంశాల తో నేడు మన మార్కెట్లు అతలా కుతలం కానున్నాయి.
-
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
-
గత ముగింపు: 15332
-
మద్దత్తులు :15169- 15080-14930
-
అవరోధాలు : 15542-15661-15814
-
.