16-07-2009 :: 6:30 pm
మార్కెట్ రిపోర్ట్
రెండు రోజుల లాభాల తరువాత నేడు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. నేడు సెన్సెక్స్ 3 పాయింట్లు కోల్పోయి 14250 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 2 పాయింట్ల నష్టం తో 4231 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 0.02 శాతం, నిఫ్టీ 0.05 శాతం మేరకు క్షీణించాయి.వరుసగా రెండు రోజులు లాభాల బాటన నడిచి 850 పాయింట్లు బలపడ్డ స్టాక్ మార్కెట్.. ఈ రోజు మాత్రం లాభార్జన కోసం సాగిన క్రయవిక్రయాల్లో నష్టాలను చవిచూసింది. వాస్తవానికి ఈ రోజు ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుండి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో 100 పాయింట్లు లాభంతో 14,352 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.
లాభాల ప్రక్రియలో సెన్సెక్స్ గరిష్ఠంగా 14,493 వద్దకు చేరుకుంది. అయితే మధ్యాహ్నపు తాజా ట్రేడ్‌లలో సెన్సెక్స్ అనూహ్యంగా నష్టాల్లోకి జారుకుంది.ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయింది. ఐరోపా మార్కెట్ల ప్రభావం , ప్రతీకూల ద్రవ్యోల్బణ గణాంకాలు మన మార్కెట్లో నెలకొని ఉన్న బుల్ల్స్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసింది. జూలై 4 తాలూకు ద్రవ్యోల్బణం గణాంకాలు 1.21% ప్రతివృద్ధిని సాధించాయి. గత వారం ఇది 1.55% గా నమోదు అయ్యింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.24 % , స్మాల్ క్యాప్ రంగం 0.39% వృద్ధిని సాధించాయి.
సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఆటో, చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్, కన్‌స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్‌లు 1.5 శాతం నుండి 2 శాతం వరకు పుంజుకున్నాయి. మరోవైపు కన్‌స్యూమర్ గూడ్స్ 1.6 శాతం మేరకు నష్టపోయింది.
సెన్సెక్స్ స్టాకు ల లో Sterlite నేడు 6.1% నష్టపోయింది. దీనికి కారణం ఈ కంపనీ విడుదల చేసిన అమెరికా డేపజిటరి రసీదు (ADR ) గత ముగింపు ధర కంటే 6% తక్కువ ధరకి అమ్మివేసింది. ఆ ప్రభావం మన మార్కెట్ల పై పడింది. నేడు RELIANCE INFRA వాటాలు కూడా 4 % నష్టాలను చవిచూసింది. నేటి ట్రేడింగ్ లో మారుతి, రిలయన్స్ వాటాలు 3.2 % చొప్పున లాభ పడ్డాయి.
.......................................................................................