• 16-07-2009 :: 8:05 AM

  • మార్కెట్ నాడి

నేడు మన మార్కెట్లు లాభాల " హట్రిక్" సాధించే దిశ గా ప్రయత్నం చేయనున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుండి బలమైన సంకేతాలు మన మార్కెట్లకి నేడు కూడా తోడ్పడనున్నాయి . పైగా ఆర్ధిక మాంద్యం నుండి ఆసియా మార్కెట్లు బయట పడుతుండటం , అమెరికా లో కంపెనీలు త్రై మాసిక ఫలితాలు ఉత్తమంగా అందివ్వటం మున్నగు అంశాలు మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యం గా విదేశీ సంస్థాగత మదుపర్లు మన మార్కెట్ల పై మగ్గు చూపు తుండటం మన మార్కెట్లకు ఉపకరించ నున్నాయి. సెన్సెక్స్ , కీలక 14040 పాయింట్లు నిన్న దాటటం , సామాన్య మదుపర్ల లో సైతం కొంత ఊరట కలిగించే విషయం.
నేడు ద్రవ్యోల్బణ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు కొంత మేరకు మన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ప్రతికూలం గా ఉంటే, భల్లూకాలు ఈ గణాంక ఫలితాలను అయూధం గా మార్చుకునే ప్రయత్నం చేయవచ్చు. ఐనప్పటికీ, నేడు బుల్ల్స్ దే పై చేయి గా ఉండే అవకాశాలే ఎక్కువ.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14253
  • మద్దత్తులు : 14243- 14040-13886
  • అవరోధాలు : 14428-14534-14665