• 27-07-2009:: 6 pm

మార్కెట్ రిపోర్ట్

లాభాలను సొమ్ము చేసుకునే నేపధ్యం లో నేడు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. నేడు సెన్సెక్స్ స్వల్పం గా 4పాయింట్లు క్షీణించి 15375 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 4 పాయింట్లు లాభం పడి 4572 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలను నమోదు చేస్తూ ముగిసింది. రిలయన్స్ ఫలితాలు మార్కెట్ల ని నిరాశ పరచటం తో , మన మార్కెట్ల లో సెంటిమెంట్ బలహీనం గా ఉండటం తో మార్కెట్లు క్షీణించాయి. నేడు ఆసియా మార్కెట్లు లాభాలను గడించినప్పటికీ మన మార్కెట్ల పై ఆ సానుకూల ప్రభావం పడలేదు. ఒక దశ లో సెన్సెక్స్ క్షీణించి 15, 228 పాయింట్ల వరకు పడిపోయింది . ఐతే ఇతర కంపనీల ఫలితాలు ఆశా జనకం గా ఉండటం తో మరల కొంత పుంజుకొని , చివరకు ఫ్లాట్ గా ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.63 % , స్మాల్ క్యాప్ రంగం 1.53 % లాభం పడటం విశేషం.
నేడు యఫ్. యం. సి. జి. , రియాలిటీ ఇండెక్స్ లు మంచి లాభాలను ఆర్జించాయి. ఇవి 3.65 %, 3.11% చొప్పున లాభ పడ్డాయి. గత వారంతం లో భారి గా లాభ పడ్డ ఆటో ఇండెక్స్ లో నేడు ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకోవటం తో ౦.51 % క్షీణించింది. ఐతే రిలయన్స్ ప్రభావం వలన నేడు చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ అత్యధికం గా 3.1 % శాతం నష్టపోయింది.
సెన్సెక్స్ స్టాకు ల పరం గా పరిశీలిస్తే, నేడు HUL అద్భుతమైన ఫలితాలు అందివ్వటం తో 5.9 % ఎగబాకింది. కాగా టాటా పవర్ 5.5 % లాభాలను ఆర్జించింది. నేడు రిలయన్స్ 3.7 % , HERO HONDA 3 % నష్టాలను నమోదుచేసాయి.