• 27-07-2009 :: 8 am

మార్కెట్ నాడి

గత రెండు రోజులు గా కంపనీలు త్రై మాసిక ఫలితాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. దీనికి ప్రతిక్రియ గా నేడు మార్కెట్లు స్పందించనున్నాయి. ముఖ్యం గా ICICI BANK, JP ASSOCIATES, RELIANCE ఫలితాలకు స్పందన నేడు మార్కెట్ల లో గమనించ వచ్చు. రిలయన్స్ ఫలితాలు మార్కేట్లని నిరాశ పరిచింది కనుక దీని ప్రభావం మార్కెట్ల పై కొంత ప్రతికూలం గా ఉండే అవకాశం ఉంది.

దేశం లో వర్షా భావ పరిస్థితి నెలకొని ఉన్నందున ప్రభుత్వం బియ్యం, గోదుమల ఎగుమతులను నిలిపివేసింది. ఈ అంశం కూడా మార్కెట్ల పై ప్రభావం చూపనున్నది.

పైగా గత శుక్రవారం అమెరికా మార్కెట్ల లో సైతం కొంత లాభాలను సొమ్ము చేసుకునే ప్రయత్నం జరిగింది.

ఐతే , నేటి ఆసియా మార్కెట్లు లాభాలలో పయనిస్తుండటం నేడు మన మార్కెట్లకి కొంత చేయూత నిచ్చే అవకాశం లేకపోలేదు.

ఈ అంశాలన్నీ పరిశీలిస్తే, నేడు మార్కెట్ల లో కొంత ఒడిదుడుకులు కనిపించే అవకాశం ఉంది. నేడు SCRIPTS వారిగా ట్రేడ్ చేయటం ఉత్తమం.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15379
  • మద్దత్తులు :15169- 15080-14930
  • అవరోధాలు : 15542-15661-15814