..................................................................................................
  • 15-07- 2009 :: 6 PM

  • మార్కెట్ రిపోర్ట్

నేడు మన మార్కెట్లు మరొక సారి అద్భుతం గా రాణించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లు పుంజుకుని 14,253 వద్ద నిలిచింది. ఇది మేము ఉదయం సూచించిన 14243 పాయింట్ల కీలక మజిలీకి అత్యంత సమీపని గుర్తించాలి. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 4,234 వద్ద ముగిసింది.

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 13,917 వద్ద ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ప్రారంభ ఘడియల్లో సెన్సెక్స్ స్వల్పంగా క్షీణించి 13,891 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.అయితే గోల్డ్ మాన సచ్క్స్ ,ఇంటెల్ సంస్థలు అమెరికా మార్కెట్ల లో అదుతమైన ఫలితాలు అందించటం , తత్ద్వారా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆసక్తిని పెంచడంతో బుల్ లాభాల వైపు పరుగులు తీసింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ మధ్యాహ్న ట్రేడ్‌లో 445 పాయింట్లు బలపడి 14,299 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. చివరికి 14,253 వద్ద స్టాక్ మార్కెట్ ముగిసింది. ఆర్థిక కార్యదర్శి BHEL లో ఆర్ధిక సంస్కరణలు అమలు చేయనున్నట్లు చేసిన ప్రకటన కూడా బుల్ల్స్ కి ఆద్యంతం చేయూతనిచ్చింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 4.2 %, స్మాల్ క్యాప్ రంగం 4.6 % వృద్ధిని సాధించాయి.
అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు కొంత మేరకు లాభాలను గడించాయి. నిన్న లాభాల బాటన నడిచిన రియాల్టీ ఇండెక్స్ నేడు కూడా దాన్ని కొనసాగించింది. దీంతో 8.5 శాతం వృద్ధి చెందింది. మెటల్ (లోహ), కన్‌స్యూమర్ డ్యూరబుల్స్, విద్యుత్, పీఎస్‌యూ ఇండెక్స్‌లు 5 శాతం మేరకు లాభపడ్డాయి.
ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే HINDALCO 8.2%, JP ASSOCIATES 7.7 % లాభాలను ఆర్జించాయి. నేడు కేవలం ఇన్ఫోసిస్ నష్టపోయిన వాటా గా చరిత్ర రాసింది. నేడు ఈ స్టాకు ౦.9 % నష్టాన్ని చవిచూసింది.
..................................................................................................