- 15-07-2009 :: 8 am
- మార్కెట్ నాడి
- నిన్నటి అద్భుత ప్రదర్శన తరువాత మార్కెట్లు నేటి దిశని నిర్ధారించుకునేందుకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ చేయబోయే ప్రకటనలు, ప్రపంచ మార్కెట్ల తీరు ని పరిగణం లోకి తీసుకో నున్నాయి ఆర్ధిక మంత్రి నిన్న పబ్లిక్ రంగ సంస్థల లో సంస్కరణ విషయం పై కసరత్తు చేయనున్నట్లు సూచనలు ఇవ్వటం వలన మన మార్కెట్ల లో కొంత ఉత్సాహం చోటుచేసుకుంది. నేడు ఈ అంశం పై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆర్ధిక మంత్రి ప్రకటనలను బట్టి , సంభందిత వాటాలు కొంత లాభ పడే అవకాశాలు ఉన్నాయి. ఋతుపవనాలు ఊపందుకోవడం , BRIC దేశాల లో కెల్లా మన మార్కెట్లే ఉత్తమంగా ఉంటాయన్న అంచనాలు కూడా మన మార్కేట్లని ఉత్సాహ పరచనున్నాయి.
- ఆసియా మార్కెట్లు కొంత మిశ్రమంగా పయనించటం వలన మన మార్కెట్లు , బహుశా నిన్నటి దూకుడు తనం కనపరచక పోవచ్చు.
- నేడు మన మార్కెట్లు కొంత స్థిరత్వం పొందే దిశగా పయనం సాగించ వచ్చు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 13854
- అవరోధాలు : 13886-14040-14243
- మద్దత్తులు : 13768-13481-13386
.........................................................................................................