.

..................................................................................................

  • 20-07-2009

  • మార్కెట్ రిపోర్ట్
ఈ వారం మార్కెట్లు శుభారంభం చేసాయి. సానుకూల ప్రపంచ మార్కెట్ల నడుమ , మన మార్కెట్లు కూడా నేడు భారి గా లాభాలను ఆర్జించాయి. నేడు సెన్సెక్స్ 446 పాయింట్లు లాభ పడి 15 వేల మార్కు ని దాటడం నేటి ట్రేడింగ్ విశేషం. నేడు సెన్సెక్స్ ౩% వృద్ధిని సాధించి 15191 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 127 పాయింట్ల లాభాల తో 4502 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాలు 2.5 % లాభాలను నమోదు చేసాయి. నేడు ఐ. టి వాటాల లో కొనుగోళ్ళ జోరు కనిపించింది. నేడు ఐ. టి . ఇన్డెక్స్ అత్యధికం గా 7.26 % లాభాలను ఆర్జించటం విశేషం. TCS సాధించిన ఉత్తమ Q 1 ఫలితాలు ఇందుకు గాను దోహద పడింది. నేడు TCS భారి గా 15.3 % వృద్ధి పొందింది. విప్రో వాటాలు కూడా 7.1 % లాభ పడి ఐ. టి. ఇన్డెక్స్ వృద్ధికి చేయూత నిచ్చింది. నేడు FMCG మినహా అన్ని రంగాలు లాభాలను ఆర్జించాయి. ఐ. టి తరువాత నేడు రియాలిటి రంగం లాభాల లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సెన్సెక్స్ వాటా ల లో రిలయన్స్ ఇన్ఫ్రా 1.2 %, ఐ.టి. సి 2 % నష్టాలను చవిచూసాయి.