20-07-2009 :: 8 AM

మార్కెట్ నాడి

గడిచిన వారం లో లాభాల తో ముగిసిన మన మార్కెట్లు నేడు మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయనున్నాయి . ఆసియా మార్కెట్లు నేడు బలం గా ప్రారంభం అవ్వటం, అమెరికా మార్కెట్ల లో కంపనీల ఫలితాలు సంతృప్తి కరంగా ఉండటం వంటి అంశాలు మన మార్కెట్ల లో ఉత్సాహాన్ని నింపే అంశాలు. అంతర్జాతీయ మార్కెట్ల లో commodities , ఆయిల్ ధరలు వృద్ధి చెందుతున్నందున, మన మార్కెట్ల లో నేడు మెటల్స్ రంగం లో సంచలనం కనిపించే అవకాశం ఉంది. గత రెండు రోజులు గా భారిగా పతనమైన sterlite industries నకు తిరిగి పుంజుకునేందుకు నేడు మంచి అవకాశం.

నేడు RIL-RNRL వివాదం పై సుప్రీం కోర్ట్ స్పందన సెన్సెక్స్ సూమో వీరుడైన RIL ని ప్రభావితం చేయనున్నది. కాబట్టి సెన్సెక్స్ గమనాన్ని ఈ అంశం నిర్దేశించ నున్నది. అంతే కాక నేడు వినియోగ దారు ధరల సూచీ గణాంకాలు విడుదల కానున్నాయి. గణాంకాల ప్రభావం మార్కెట్ల పై ఉండే అవకాశం ఉంది కనుక నేడు మన మార్కెట్ల లో పూర్తి గా బుల్ల్స్ పెత్తనం కొనసాగిస్తాయని చెప్పలేము. పైగా అమెరికా హోం కార్యదర్శి హిల్లరీ క్లింటన్ మన దేశం పై కార్బన్ విడుదల అంశం పై తీవ్ర స్థాయి లో వత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం సాగిస్తున్నారు. అమెరికా చేస్తున్న ప్రతిపాదనలు మన దేశానికి అంగీకార యోగ్యం కాదని ఇప్పటికే మంత్రి జైరాం రమేష్ ఖరా ఖండీ గా చర్చ ల లో తేల్చి చెప్పేయటం గమనార్హం. ఐతే ఇండియా పై వత్తిడి పెంచేందుకు అమెరికా మన దేశం నుండి ఎగుమతులను నిలిపివేసే ప్రతిపాదనని అమలుపరచ వచ్చని హెచ్చరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే మన మార్కెట్లు కొంత భయాందోలనకి గురికావచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14745
  • మద్దత్తులు : 14665-14534-14425
  • అవరోధాలు : 14888-14930-15080

  • ..................................................................................................