• .............................................................................................
  • 21-07-2009:: 9 :30 am

  • మార్కెట్ నాడి
ఆశించిన దాని కంటే ఉత్తమంగా Q 1 ఫలితాలు మన కంపనీలు అందిస్తుండటం తో మన మార్కెట్ల లో రెట్టింపు ఉత్సాహం నెలకొని ఉంది. తాజా గా HSBC ASSET MANAGEMENT ఈ సంవత్సరానికి గాను 6 నుండి 8 శాతం వరకు వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని, ఇదే వచ్చే సంవత్సరానికి గాను 11 నుండి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రకటించటం,నేడు మన మార్కెట్లకు మరింత జోరు అందించనుంది. ఈ అంచనాల తో విదేశీ ఏజెన్సీ లు కూడా మన మార్కెట్ల రేటింగ్ ని సానుకూలంగా పరిశీలించే అవకాశం సమీప భవిష్యత్తు లో ఉంది.

ఐతే నేడు ఆసియా మార్కెట్ల లో ప్రాఫిట్ బూకింగ్ చోటు చేసుకుంటున్న దృశ్యా మన మార్కెట్ల పై దీని ప్రభావం పడనున్నది. నేడు మన మార్కెట్లు లాభాల తో ప్రారంభమైనా , తరువాత ప్రాఫిట్ బూకింగ్ వలన క్షీణించే అవకాశం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15191
  • మద్దత్తులు : 15080-14930-14888-14665
  • అవరోధాలు : 15228-15367-15542-15661

..................................................................................................