29-07-2009.:: 5PM

మార్కెట్ రిపోర్టు

బలహీన మైన ఆసియా మార్కెట్ల నడుమ నేడు మన మార్కెట్లు నష్టాలను చవిచూసాయి. నేడు సెన్సెక్స్ సుమారు 158 పాయింట్లు కోల్పోయి 15173 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 4513.5 పాయింట్ల వద్ద ముగిసింది.

బలహీనం గా ప్రారంభమైన మన మార్కెట్లు , కొంత పుంజుకునే ప్రయత్నం చేసాయి . ఈ ప్రక్రియ లో సెన్సెక్స్ గరిష్టం గా 15379 పాయింట్ల కు చేరుకుంది. ఐతే చైనా మార్కెట్లు భారిగా పతనమవ్వటం తో ఆసియా మార్కెట్లన్నీ కూడా నష్టాల బాట పట్టాయి. దీనితో మన మార్కెట్లు కూడా క్షీణించాయి. సెన్సెక్స్ ఒక దశ లో కనిష్టం గా 14888 పాయింట్ల వరకు క్షీణించింది. ఈ స్థాయి లో కొనుగోళ్ళు ప్రారంభామవ్వటం తో మార్కెట్లు క్రమం గా పుంజుకున్నాయి . చివరికి .ని.ఫ్టీ . సెన్సెక్స్ సుమారు ఒక శాతం నష్టాలను నమోదు చేస్తూ ముగిసాయి.

నేటి ట్రేడింగ్ లో టర్న్ ఓవర్ భారి స్థాయి లో జరగటం విశేషం. నేడు చరిత్ర లో టర్న్ ఓవర్ స్థాయి లో మూడవ స్థానం దక్కించుకుంది. నేడు 1.47 trillion మేరకు అమ్మకాలు జరిగాయి.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ 0.98 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 1,46 శాతం క్షీణించింది.

నేడు రియాలిటీ రంగం అత్యధికం గా క్షీణించింది. ఈ రంగం 4.36 శాతం నష్టపోయింది. కాగా కన్సుమేర్ డ్యుర బుల్స్ 3.13 శాతం నష్ట పోయింది. నేడు ఐ.టి ఇండెక్స్ , ఆయిల్ మరియు గ్యాస్ సుమారు .౦.౩౩ శాతం లాభపడ్డాయి.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే DLF 6.58 % ,TATA STEEL 5.77 % నష్టపోగా , TCS 4.18 % , TATA POWER 2.91 % లాభ పడ్డాయి.