మార్కెట్ ముందు చూపు
(27-07-2009 నుండి 31-07-2009 )
అనూహ్యమైన ఫలితాలను కంపనీలు ప్రకటిస్తుండటం తో మన మార్కెట్లు గత వారం సుమారు 4.4 % వృద్ధిని నమోదు చేసాయి. ఈ వారం కూడా కొన్ని ముఖ్య మైన కంపనీ ల ఫలితాలు మార్కెట్ దృష్తి ని ఆకర్షించ నున్నాయి. ముఖ్యం గా SBI, RCOM, REL.INFRA , HUL, DLF, TATA STEEL , NTPC, PUNJ LLOYD మున్నగు హేమా హేమి లు తమ ఫలితాలను ప్రకటించ నున్నాయి. ఈ ఫలితాలు సానుకూలం గా ఉంటే మార్కెట్ల లో మరింత ఉత్సాహం కనబడవచ్చు.
ఈ వారం 28 వ తేదిన రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధానం పై అంచనాలు కూడా మార్కెట్ ని ప్రభావితం చేసే అంశం. ఐతే ఈ సారి రిజర్వు బ్యాంక్ తమ రేపో , రివర్స్ రేపో , CRR విధానాల లో ఎటువంటి మార్పు ప్రకటించ బోదని అంచనాలు. ఇందుకు భిన్నం గా జరిగి తే మార్కెట్లు తదనుగుణం గా స్పందించ నున్నాయి. ఈ నేపద్త్యం లో ఉద్దేపన విధాన ల లో భాగం గా RBI ఇప్పటి వరకు 425 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.75 % గా రేపో రేటు ని కొనసాగిస్తోందన్న అంశం మరువ కూడదు.
అంతర్జాతీయం గా పరిశీలిస్తే, దక్షిణ కొరియా మాంద్యం నుండి బయట పడనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. వీటి తాలూకు గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశం కూడా మన మార్కెట్ల తో సహా ఆసియా మార్కెట్ల పై సానుకూలం గా ప్రభావితం చేయనున్నది. ఈ నెల 31 న అమెరికా GDP గణాంకాలు విడుదల కానున్నది . వీటి తాలూకు ముందస్తు అంచనాలు మార్కెట్ల దృష్టి ని ఆకర్షించ నున్నది.
మన మార్కెట్ల లో ఈ గురువారం F & O ముగింపు సందర్భం గా మార్కెట్లు 29 , 30 తేదీలలో ప్రపంచ మార్కెట్ల తీరు తెన్నులకి అతీతం గా ట్రేడ్ అవ్వనున్నది . గత శుక్రవారం రిలయన్స్ ఫలితాలు నిరాశ పరిచినందున, సోమ మంగళ వారాల లో ఏర్పడ బోయే షార్టుల కు ప్రతిక్రియగా , గురువారం మార్కెట్ల లో షార్ట్ కవెరింగ్ ర్యాలీ కి ఆస్కారం ఉంది.
టెక్నికల్ గా పరిశీలిస్తే మార్కెట్లు ప్రస్తుతం అతి గట్టి అవరోధమైన 15367 పాయింట్ల సమీపం లో ట్రేడ్ అవుతున్నది. ట్రేడర్లు ఈ అవరోధం వద్ద కొంత లాభాలను సోమ్ముచేసుకునే అవకాశం ఉంది . రిలయన్స్ ఫలితాలు కూడా ఇందుకు ఉపకరించనున్నది. సెన్సెక్స్ కృంగి తే 14530 వద్ద గట్టి మద్దత్తు ఉంది. ప్రపంచ మార్కెట్లు సానుకూలం గా ఉన్నందు వలన , బహుశా ఇంత కంటే మార్కెట్ క్షీనించక పోవచ్చు. సెన్సెక్స్ నకు ఈ 15169-15080-14930-14781-14530 ముఖ్యమైన మద్దత్తు స్థాయిలు . కాగా 15542-15661-15814-15954 కీలక అవరోధాలు. 16002 పాయింట్ల వద్ద గట్టి అవరోధం ఉంది.
ఈ వారం మార్కెట్లు ముందు గా కొంత కోల్పోయి, చివరకు మరల పుంజుకునే అవకాశం ఉంది. ఒక విధం గా చెపాలంటే , మార్కెట్ CONSOLIDATE అవ్వనున్నది
ఇది మనందరి వెబ్సైటు. భారత దేశం లో సెన్సెక్స్, నిఫ్టీ ల వివరాలు , టెక్నికల్ అనాలిసిస్ గల ఏకైక ప్రాంతీయ బాషా వెబ్సైటు. మా ఉడుతా భక్తి సేవలను మరింత మెరుగు పరిచేందుకు మీ అమూల్య సలహాలు మాకు తెలియ చేయగలరు. ఈ వెబ్సైటు మీకు నచ్చితే మీ సన్నిహితులకు కూడా దీని గురించి తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాము --- Editor.