మార్కెట్ సమీక్ష

(20-07-2009 TO 24-07-2009 )

జూన్ 2008 తరువాత అతి గరిష్ట స్థాయి లో మార్కెట్లు ముగిసి ఈ వారం మదుపర్లకు ఆనందం కలిగించాయి. గడిచిన ఐదు రోజుల లో సెన్సెక్స్ 4.3 % లాభ పడగా , నిఫ్టీ 4.4 % వృద్ధిని నమోదు చేసింది. ఈ వారం కంపనీలు విడుదల చేసిన మెరుగైన త్రైమాసిక ఫలితాలు దృష్యా మన మార్కెట్లు భారిగా లాభ పడ్డాయి. ప్రపంచ మార్కెట్లు కూడా ఇదే ధోరణి లో లాభ పడటం కూడా మన మార్కెట్లకి చేయూత నిచ్చింది. ఈ వారం రోజు వారిగా మార్కెట్ల ప్రస్తానం ఈ విధం గా ఉండింది.

  • సోమ వారం :

మన మార్కెట్లు నేడు భారి గా లాభాలను ఆర్జించాయి. నేడు సెన్సెక్స్ 446 పాయింట్లు లాభ పడి 15 వేల మార్కు ని దాటడం నేటి ట్రేడింగ్ విశేషం. నేడు సెన్సెక్స్ ౩% వృద్ధిని సాధించి 15191 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 127 పాయింట్ల లాభాల తో 4502 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాలు 2.5 % లాభాలను నమోదు చేసాయి.

  • మంగళ వారం :

నేడు ప్రపంచ మార్కెట్లు నష్టాల బాట లో పయనించడం తో మన మార్కెట్లు కూడా క్షీణించి వాటి తో శృతి కలిపాయి.

నేడు సెన్సెక్స్129 పాయింట్లు కోల్పోయి 15062 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 4469 పాయింట్ల వద్ద స్థిర పడింది. సెన్సెక్స్ 15218 పాయింట్ల వద్ద స్వల్ప లాభం తో ప్రారంభమై గరిష్టం గా 15234 పాయింట్ల వరకు చేరుకుంది.నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.19 % నష్టపోగా , స్మాల్ క్యాప్ రంగం 0.24 % లాభ పడింది.సెన్సెక్స్ స్టాకు ల లో నేడు టాటా స్టీల్ అందరి దృష్టి ని ఆకర్షించింది. టాటా స్టీల్ GDR ద్వారా $ 500 మిలియన్ నిధులను సమ కూర్చకున్నదన్న వార్త తో 5.28 % ఎగబాకింది

  • బుధ వారం :

విక్రయాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 219 పాయింట్లు కోల్పోయి 14,843 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 4,399 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.46 శాతం, నిఫ్టీ 1.57 శాతం మేరకు క్షీణించాయి.నేడు స్మాల్ క్యాప్ రంగం 0.35 % క్షీణించింది. కాగా మిడ్ క్యాప్ రంగం 0.97 % వరకు నష్టపోయింది.

  • గురువారం :

రెండు రోజుల వరుస నష్టాల తరువాత నేడు మార్కెట్లు భారిగా లాభ పడ్డాయి . నేడు సెన్సెక్స్ 387 పాయింట్లు లాభ పడి 15231 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 125 పాయింట్లు ఎగబాకి 4524 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేడు WPI గణాంకాలు విడుదలయ్యాయి. ఈ సారి ప్రతి వృద్ధి నమోదయ్యింది. WPI 1.17 % తగ్గింది. జూన్ మాసానికి గాను ఇన్ఫ్రా రంగం 6.5 % వృద్ధిని నమోదు చేసిందన్న గణాంకాలు నేడు ఇన్ఫ్రా రంగానికి చెందిన స్టాకు ల కు బలం చేకూర్చాయి. గత మాసం లో ఈ వృద్ధి కేవలం 2.8 % గా మాత్ర మే ఉండింది. నేడు విడుదల అయిన ఈ గణాంకాల వలన గత 18 నెలల లో ఈ వృద్ధి అత్యంత వేగవంత మైనది గా రికార్డు నెలకొల్పింది. నేడు మిడ్ క్యాప్ రంగం 2.29 వృద్ధిని సాధించ గా , స్మాల్ క్యాప్ రంగం 2. 16 % లాభ పడింది.

  • శుక్ర వారం

నేడు సెన్సెక్స్ 148 పాయింట్లు ఎగ బాకి 15379 పాయింట్ల వద్ద స్థిర పడింది. కాగా నిఫ్టీ 45 పాయింట్లు లాభాలను ఆర్జించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 4569 పాయింట్లు గా నిఫ్టీ సూచీ నమోదు చేసింది. ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ స్టాకులు 1.67 % లాభ పడగా , స్మాల్ క్యాప్ స్టాకులు 1.81 % వృద్ధిని నమోదు చేసాయి. ఊహించిన దానికంటే మెరుగైన Q1 ఫలితాలను కంపనీలు అందిస్తుండటం తో నేడు కూడా మార్కెట్లు లాభ పడ్డాయి. ఐతే నేడు ట్రేడింగ్ అనంతరం విడుదల అయిన రిలయన్స్ ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నం గా , అంచనాలను తలక్రిందలు గా చేస్తూ వెలువడటం వచ్చే వారం మార్కెట్ల పై ప్రతికూల ప్రభావం చూప నున్నది.

ఈ వారం రియాలిటీ రంగం అత్యధికం గా 13.2 % లాభ పడింది. ఆటో రంగం 9.4 % లాభాలను ఆర్జించినది

స్టాకు లు వారిగా పరిశీలిస్తే , ఈ వారం satyam 14.12 % , TCS 8.62 % , HINDALCO , STERLITE , టాటా మోటార్స్, 6.5% ~ 7 % వరకు లాభాలను ఆర్జించాయి. ACC , RIL , TATA STEEL,విప్రో, PNB 5 నుండి 6 శాతం లాభాలను ఆర్జించాయి. ఈ వారం భారతి అయిర్ టెల్ స్టాక్ స్ప్లిట్ జరగటం విశేషం. ఈ వారం ZEE ENTERTAINMENT 5.16 %, HDFC 2.97 %, AIRTEL 2.92 % BHEL 2. 67 %, BPCL 1.69 % , ACL 1.16 % నష్టాలను నమోదు చేసాయి.

ఈ వారం సెన్సెక్స్ 15379 పాయింట్ల వద్ద ముగిసిందని ముందే ప్రస్తావించాము . ఐతే గత ఆదివారం మా " మార్కెట్ ముందు చూపు " శీర్షిక లో ఈ వారానికి సెన్సెక్స్ టార్గెట్ 15367 పాయింట్ల గా మేము ముందుగానే సూచించిన విషయం మీకు తెలుసు. వచ్చే వారం విశేషాలకై రేపు ఆదివారం కూడా ఎప్పటి విధం గా నే " మార్కెట్ ముందు చూపు " శీర్షిక ప్రచురించ నున్నాము.