24-07-2009 :: 6 :30 pm

మార్కెట్ రిపోర్ట్

నిన్నటి లాభాల ధోరణి కొనసాగిస్తూ నేడు కూడా మార్కెట్లు సుమారు ఒక శాతం లాభపడ్డాయి. ఊహించిన దానికంటే మెరుగైన Q1 ఫలితాలను కంపనీలు అందిస్తుండటం తో నేడు కూడా మార్కెట్లు లాభ పడ్డాయి. నేడు సెన్సెక్స్ 148 పాయింట్లు ఎగ బాకి 15379 పాయింట్ల వద్ద స్థిర పడింది. కాగా నిఫ్టీ 45 పాయింట్లు లాభాలను ఆర్జించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 4569 పాయింట్లు గా నిఫ్టీ సూచీ నమోదు చేసింది.

బలమైన ఆసియా మార్కెట్ల ప్రభావం తో సెన్సెక్స్ 15272 పాయింట్ల గ్యాప్ అప్ తో శుభారంభం చేసింది. కాని అప్పుడే ఆసియా మార్కెట్లు క్షీనించటం తో మన మార్కెట్లు కూడా ఒకానొక దశ లో నష్టపోయి కనిష్టం గా 15169 పాయింట్ల కి పడిపోయింది. ఇది సరిగ్గా మేము ఉదయం సూచించిన మద్దత్తు స్థాయి అవ్వటం విశేషం. ఆ తరువాత కంపనీల ఫలితాలు ఆశాజనకం గా విడుదల అవ్వటం తో మార్కెట్ల లో ఉత్సాహం తిరిగి చోటు చేసుకుంది. సెన్సెక్స్ గరిష్టం గా 15418 పాయింట్ల కు ఎగబాకి చివరకు 15379 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది కూడా మేము ఉదయం సూచించిన 15367 పాయింట్ల అవరోధానికి అతి సమీపమని గుర్తించాలి .

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ స్టాకులు 1.67 % లాభ పడగా , స్మాల్ క్యాప్ స్టాకులు 1.81 % వృద్ధిని నమోదు చేసాయి.

నేడు ఆటో ఇండెక్స్ మెరుగైన లాభాలను ఆర్జించటం విశేషం. ఈ రంగం 5.14 % వృద్ధి చెందగా , రియాలిటి రంగం 4.26 వృద్ధిని నమోదు చేసింది. నేటి ట్రేడింగ్ లో కేవలం బ్యాంకింగ్ రంగం 0.88 % నష్టపోయింది.

సెన్సెక్స్ స్టాకు ల లో TATA MOTORS 9.7% , DLF 6.5 % అత్యధికం గా వృద్ధిని నమోదు చేయగా , SUN PHARMA 2.2 % , HDFC 1.6 % అధికం గా కృంగి పోయాయి.