..................................................................................................
- 24-07-2009 :: 8 am
- మార్కెట్ నాడి
నిన్న భారి గా లాభ పడ్డ మార్కెట్లు నేడు కూడా అదే పంధా ను అనుసరించ నున్నాయి. నేడు ఆసియా మార్కెట్లు భారి లాభాల తో ప్రారంభమవ్వటం మన మార్కెట్లకి శుభ సూచకం. గత రాత్రి అమెరికా మార్కెట్లు , ముఖ్యం గా డౌ జోన్స్ సగటు 9000 పాయింట్ల కంటే అధికంగా ముగియటం విశేషం. జనవరి మాసం తరువాత ఇంత తారా స్థాయి లో ముగియటం ఇదే ప్రథమం. కంపనీల త్రైమాసిక ఫలితాలు ఉత్తమంగా ఉండటం తో సర్వత్రా ఉత్సుకత నెలకొని ఉంది.
నేడు మన మార్కెట్లు రాన్ బాక్సి ఫలితాల పై దృష్తి సారించ నున్నది. నేడు మార్కెట్లు ముగిసిన తరువాత సెన్సెక్స్ పెద్ద బాబు రిలయన్స్ ఫలితాలు విడుదల చేయనున్నది. ఈ ఫలితాల పట్ల అంచనాల తో నేడు స్టాక్ మార్కెట్ పయనించ నున్నది.
నేడు సానుకూల ప్రరిస్తితుల వలన మార్కెట్లు గ్యాప్ అప్ తో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఐతే సెన్సెక్స్ నకు 15,600 పాయింట్ల తీవ్ర అవరోధం ఉన్నందున మార్కెట్లు సుమారు ఈ 15540~ 15620 నడుమ పయనించే ఆస్కారం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 15231
- మద్దత్తులు :15169- 15080-14930
- అవరోధాలు : 15367-15542-15661
- .........................................................................................................