- 23-07-2009 :: 8 :00 am
- మార్కెట్ నాడి
రెండు రోజుల దిద్దుబాటు అనంతరం నేడు మార్కెట్లు తమ తదుపరి దిశ కోసం ఆర్ధిక ఫలితాల వైపు ద్రుష్టి పెట్టవచ్చు. కంపనీలు మంచి ఫలితాలు అందిస్తుండటం వలన మార్కెట్లు ప్రస్తుతం దిద్దుబాటు కి గురి అవుతున్నా ,దీర్ఘకాలం లో పుంజుకునే అవకాశం ఉంది. సెన్సెక్స్ కి సుమారు 14500 పాయింట్ల వద్ద మద్దత్తు ఉండటం వలన , నేడు మార్కెట్లు సుమారు ఈ ప్రాంతం లో కొంత స్థిరత్వం పొందే అవకాశం ఉంది. మదుపర్లు ఈ దిద్దుబాటు ని కొనుగోళ్ళ కి ఉపయోగించుకుంటే లాభకరం. ఆసియా మార్కెట్లు ప్రస్తుతం ఒడిదుడుకు ల తో పయనిస్తున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్ల పై కూడా పడనున్నది. నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అవ్వనున్నాయి. ఈ అంశం కూడా మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. అమెరికా ఫెడ్ అధ్యక్షులు ప్రస్తుతం వడ్డీ రేట్లు పెంచబోమన్న ప్రకటన కూడా విదేశీ మదుపర్ల లో కొంత సానుకూల ప్రభావం కనపరచనున్నది. వీటి ప్రభావం వలన మన మార్కెట్లు ముందు గా కొంత నష్టపోయి , ఆ తరువాత దిశా హీనం గా పయనించే అవకాశాలు ఉన్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 14843
- మద్దత్తులు : 14665-14534-14425
- అవరోధాలు : 14888-14930-15080
- ..................................................................................................