22-07-2009 :: 6 PM
- మార్కెట్ రిపోర్ట్
- విక్రయాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 219 పాయింట్లు కోల్పోయి 14,843 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 4,399 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.46 శాతం, నిఫ్టీ 1.57 శాతం మేరకు క్షీణించాయి.నిన్నటి లాభాలను కొనసాగిస్తూ.. ఈ రోజు ఉదయం 15,125 వద్ద లాభాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ గరిష్ఠంగా 15,369 వద్దకు చేరుకుంది. ఇది నేటి ఉదయం మేము సూచించిన 15,367 పాయింట్ల అవరోదానికి అత్యంత సమీపమని గుర్తించాలి . మధ్యాహ్నం వరకు లాభాల్లోనే పయనించిన సెన్సెక్స్ జూనియర్ వాణిజ్య మంత్రి జ్యోతిరాదిత్య వ్యాఖ్యల అనంతరం స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో పయనించాయి.అంతర్జాతీయ సంక్షోభం కారణంగా ఎగుమతుల్లో భారత్ లక్ష్యాన్ని అందుకోలేకపోయిందని జోత్యిరాదిత్య వ్యాఖ్యానించారు. దీంతో మధ్యాహ్న ట్రేడ్‌ల నుండి స్టాక్ మార్కెట్లో విక్రయాల ఒత్తిడి పెరిగింది. దీంతో సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 15వేల మార్కు కన్నా దిగువకు 14,786 వద్దకు పడిపోయింది.చివరికి 14,843 వద్ద స్టాక్ మార్కెట్ ముగిసింది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా బీఎస్ఈ పెట్టుబడి ఉత్పత్తుల ఇండెక్స్ 1.87 శాతం మేరకు క్షీణించింది. అలాగే ఆటో, విద్యుత్, ఐటీ ఇండెక్స్‌లు కూడా 1.6 శాతం చొప్పున నష్టపోయాయి.
- నేడు స్మాల్ క్యాప్ రంగం 0.35 % క్షీణించింది. కాగా మిడ్ క్యాప్ రంగం 0.97 % వరకు నష్టపోయింది. ఇక సెన్సెక్స్ స్టాకు ల వారిగా పరిశీలిస్తే HDFC 4.4 % , HINDALCO 3.4 % అత్యధికం గా నష్టాలను చవిచూసాయి. నేడు ONGC 4.6% లాభ పడి బుల్ల్స్ కి కొంత ఊరట కలిగించింది. నేటి ట్రేడింగ్ లో STERLITE INDUSTRIES 0.9 % లాభ పడింది.
- ...................................................................................................................