• 23-07-2009 :: 6:౩౦ PM

  • మార్కెట్ రిపోర్ట్

రెండు రోజుల వరుస నష్టాల తరువాత నేడు మార్కెట్లు భారిగా లాభ పడ్డాయి . నేడు సెన్సెక్స్ 387 పాయింట్లు లాభ పడి 15231 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 125 పాయింట్లు ఎగబాకి 4524 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్ లో జూన్ 15 తరువాత ఇంత గరిష్ట స్థాయి లో మార్కెట్లు ముగియటం ఇదే ప్రథమం.

ఈ రోజు ఉదయం 15,009 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోయి కనిష్టంగా 14,998 వద్దకు పడిపోయింది. ఎంచుకున్న స్టాకుల్లో కొనుగొళ్లపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టడంతో సెన్సెక్స్ భారీగా లాభాలవైపు పరుగులు తీసింది.ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 420 పాయింట్లు పుంజుకుంది. చివరికి 15,231 వద్ద స్టాక్ మార్కెట్ ముగిసింది.

నేడు WPI గణాంకాలు విడుదలయ్యాయి. ఈ సారి ప్రతి వృద్ధి నమోదయ్యింది. WPI 1.17 % తగ్గింది. జూన్ మాసానికి గాను ఇన్ఫ్రా రంగం 6.5 % వృద్ధిని నమోదు చేసిందన్న గణాంకాలు నేడు ఇన్ఫ్రా రంగానికి చెందిన స్టాకు ల కు బలం చేకూర్చాయి. గత మాసం లో ఈ వృద్ధి కేవలం 2.8 % గా మాత్ర మే ఉండింది. నేడు విడుదల అయిన ఈ గణాంకాల వలన గత 18 నెలల లో ఈ వృద్ధి అత్యంత వేగవంత మైనది గా రికార్డు నెలకొల్పింది.

నేడు సెక్టోరల్ ఇండెక్స్‌లు అన్నీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ రియాల్టీ 5 శాతం మేరకు వృద్ధి చెందింది. ప్రధాన రంగం ఇండెక్స్‌లో 6.5 శాతం, అలాగే సిమెంట్ 5.1 శాతం, బొగ్గు, క్రూడ్ ఆయిల్, విద్యుత్‌లు కూడా వృద్ధి చెందాయి. కన్‌స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ 4.47 శాతం, మెటల్ 4.32 శాతం, ఎఫ్‌సీఎంజీ 3.95 శాతం, ఆటో ఇండెక్స్ 3.97 శాతం చొప్పున బలపడ్డాయి .

నేడు మిడ్ క్యాప్ రంగం 2.29 వృద్ధిని సాధించ గా , స్మాల్ క్యాప్ రంగం 2. 16 % లాభ పడింది.

సెన్సెక్స్ స్టాకు ల వారిగా చూస్తె నేడు కేవలం భారతి అయిర్ టెల్ మాత్రమె 1.1 % నష్టపోయింది. కాగా మిగిలిన అన్ని సెన్సెక్స్ స్టాకులు లాభాలను ఆర్జించాయి. RELIANCE INFRA 6.9 % , DLF 6.8 % అత్యధికం గా లాభాలను ఆర్జించాయి.

  • .............................................................................................