- 22-07-2009 :: 9 .15 AM .IST
- మార్కెట్ నాడి
నేడు మార్కెట్లు మరొక సారి ముందంజ వేసే ప్రయత్నం చేయనున్నాయి. నిన్నటి ట్రేడింగ్ లో 15 వేల మార్కు కంటే తగ్గకుండా ముగియటం నేడు మదుపర్లలో కొంత విశ్వాసాన్ని కలగా చేయనున్నది. బ్లూమ్ బర్గ్ సర్వే ప్రకారం ఆసియా మార్కెట్లు, అందులోనూ విశేషంగా ఇండియా,చైనా దేశాల పట్ల విదేశీ మదుపర్లు సముఖం గా ఉన్నారని వెల్లడయ్యింది. కాబాట్టి దీర్ఘ కాలిక దృష్తి తో చూస్తె మన మార్కెట్లు మును ముందు మరింత పుంజుకునే అవకాశం ఉంది.
నేటి ట్రేడింగ్ లో ఆసియా మార్కెట్లు కొంత ఒడిదుడుకుల తో పయనిస్తోంది కావున మన మార్కెట్లు కూడా ఆసియా మార్కెట్ల తీరుని అనుకరించ వచ్చు. పైగా నిన్న పార్లమెంట్ లో వ్యవసాయ మంత్రి శరద్ పవర్ , వాయవ్య రాష్ట్రాల లో వర్శా భావ పరిస్థితి తీవ్రం గా ఉన్నదని తెలపటం మన మార్కెట్ల సెంటిమెంట్ ని దెబ్బ తీసే అవకాశం లేక పోలేదు.
ఈ అంశాలను పరిశీలిస్తే నేడు మన మార్కెట్లు కొంత ఒడిదుడుకుల తో పయనం సాగించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మన మార్కెట్లు కొంత consolidation చేసుకునేందుకు ఉపయోగించుకోనున్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 15062
- మద్దత్తులు : 14930-14888-14665
- అవరోధాలు : 15169-15228-15367-
- ..................................................................................................