21-07-2009 :: 6 PM
మార్కెట్ రిపోర్ట్
నేడు మన మార్కెట్ల లో bears మరల రంగ ప్రవేశం చేసాయి. నేడు ప్రపంచ మార్కెట్లు నష్టాల బాట లో పయనించడం తో మన మార్కెట్లు కూడా క్షీణించి వాటి తో శృతి కలిపాయి. గత మూడు రోజుల గా భారి లాభాలను ఆర్జించిన మన మార్కెట్ల లో , నేడు ఉదయమే మేము సూచించిన విధం గా ప్రాఫిట్ బుకింగ్ కి లోనయ్యాయి.
నేడు సెన్సెక్స్129 పాయింట్లు కోల్పోయి 15062 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 4469 పాయింట్ల వద్ద స్థిర పడింది. సెన్సెక్స్ 15218 పాయింట్ల వద్ద స్వల్ప లాభం తో ప్రారంభమై గరిష్టం గా 15234 పాయింట్ల వరకు చేరుకుంది. ఐతే ఇది మేము ఉదయమే సూచించిన 15228 పాయింట్ల అవరోదానికి అతి సమీపమని గుర్తించాలి. ఈ అవరోధాన్ని చెదించ లేక , ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది క్షణాలకే నష్టాల బాట పట్టింది. ట్రేడర్లు మొదటి నుండే లాభాలను సోమ్ముచేసుకోవటం పై ఆసక్తి కనపరచటం తో నేడు కొనుగోళ్ళు డీలా పడ్డాయి .
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.19 % నష్టపోగా , స్మాల్ క్యాప్ రంగం 0.24 % లాభ పడింది. మెటల్స్ రంగం 1.25 వృద్ధిని నమోదు చేయగా , ఆటో ఇండెక్స్ ౦. 11 లాభాలను ఆర్జించింది. నేడు ఐ. టి ఇండెక్స్ అధికంగా 1.74 % , పవర్ ఇండెక్స్ 1.70 % నష్టాలను చవిచూసింది.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు టాటా స్టీల్ అందరి దృష్టి ని ఆకర్షించింది. టాటా స్టీల్ GDR ద్వారా $ 500 మిలియన్ నిధులను సమ కూర్చకున్నదన్న వార్త తో 5.28 % ఎగబాకింది కాగా MARUTI SUZUKI 2.62 % లాభాలను నమోదు చేసింది . TCS 4.54 % , BHEL 2.67 % నష్టాలను చవిచూసింది