19-07-2009
మార్కెట్ ముందుచూపు
(20-07-2009 నుండి 24-07-2009 )
ఆర్ధిక సంస్కరణలు చేపట్టే దిశ గా ప్రభుత్వం అడుగులు వేయటం తో గత వారం మార్కెట్లు భారి గా లాభ పడ్డాయి .ఈ వారం , వీటికి సంబంధించి ప్రభుత్వం మరిన్ని వివారాలు విడుదల చేయవచ్చు. ప్రభుత్వం చేయబోయే ప్రకటన వలన తత్సంబంధిత కంపనీ వాటాలు వృద్ధి చెందనున్నాయి. అదే విధం గా అమెరికా హోం సెక్రటరీ హిల్లరీ క్లింటన్ భారత పర్యటన కూడా మన మార్కెట్లను ప్రభావితం చేయనున్న అంశం. క్లింటన్ ఈ పర్యటన లో అమెరికా కంపనీలకి అణు ఒప్పందం తాలూకు ఆర్డర్లను ఖారారు చేయనున్నారు. ఈ ఆర్డర్లు G E కి , TOSHIBHA CORP నకు దక్కే అవకాశాలు ఉన్నాయని వార్త. మన మార్కెట్ల పరం గా విశ్లేషిస్తే ఈ వారం పవర్ రంగానికి చెందిన వాటాలు , ముఖ్యం గా NTPC, BHEL , AREVA ల లో సంచలనం కనిపించే అవకాశం ఉంది. అదే విధం గా పర్యావరణ అంశం పై కూడా చర్చలు క్లింటన్ జరుప నున్నారు. చర్చల అనంతరం భారత్-అమెరికా విడుదల చేయ బోయే సంయుక్త ప్రకటన మన మార్కెట్లకి కీలకం. క్లింటన్ ఇప్పటికే అంబాని, రతన్ టాటా లో చర్చించటం ఈ సందర్భం లో గమనార్హం.
మంగళ బుధవారాలు అమెరికా ఫెడరల్ అధ్యక్షులు బెన్ బెర్నన్కే ద్రవ్య విధానం పై ప్రకటనలు చేయనున్నారు. ఈ ప్రకటనలు కూడా మన మార్కెట్ల దిశను నిర్దేశించే నున్నాయి.
ఈ అంశా లే కాక , గురువారం మనకు విడుదల అవ్వబోయే ద్రవ్యోల్బణ గణాంకాలు, RIL- RNRL వివాదం పై సుప్రీం లో జరిగే వాదోప వాదాలు - మలుపు లు , విదేశీ సంస్థాగత మదుపర్లు జరిపే కొనుగోళ్ళు మున్నగు అంశాలు కూడా ప్రభావితం చేయబోయే అంశాలు.
టెక్నికల్ గా పరిశీలిస్తే ఈ వారం సెన్సెక్స్ 15 వేల మార్కు ను దాటే అవకాశం ఉందనే చెప్పాలి. సెన్సెక్స్ నకు ఈ వారం 14930 -15080-15160-15228 అవరోధాలు కానున్నాయి. ఐతే సెన్సెక్స్ నకు 15367 అవరోధం అతి భీకరమైన అవరోధం . కాగా 14534-14243-14040-13886 సెన్సెక్స్ నకు మద్దత్తు స్థాయిలు.
ప్రభుత్వం ప్రకటించే ఆర్ధిక సంస్కరణల అంశాలు ఈ వారానికి కానున్నన హైలైట్ .
....................................................................................................