• 14-07- 2009 :: 6:15 PM

  • మార్కెట్ రిపోర్ట్

నేడు మన మార్కెట్లు భారి గా లాభాలను ఆర్జించాయి. నేడు సెన్సెక్స్ , మేము ఉదయమే సూచించిన విధం గా 453 పాయింట్ల లాభం పొంది 13853 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 137 పాయింట్ల లాభాలను ఆర్జించి 4111 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల నుండి బలమైన సంకేతాల సహాయం వలన నేడు మన మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. నేడు మార్కెట్ లో కొంత షార్ట్ కవెరింగ్ కూడా చోటు చేసుకోవటం వలన నేడు బుల్ల్స్ ,మార్కెట్ పై తమ ఆధిపత్యాన్ని చాటాయి. నేడు ఒక దశ లో సెన్సెక్స్ 500 పాయింట్ల పై చిలుకు లాభపడటం విశేషం.

నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ రంగం 4.27 % లాభ పొందగా , స్మాల్ క్యాప్ రంగం 4.4 % వృద్ధిని సాధించింది. నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాల ఇండే క్స్ లు లాభాలను ఆర్జించటం విశేషం. నేటి ట్రేడింగ్ లో రియాల్టీ రంగం అత్యధికం గా 9.38 % ఎగబాకింది. కాగా మెటల్స్ 5.53 % లాభ పడింది.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేటి మార్కెట్ లో DLF 11.4 %, రిలయన్స్ ఇన్ఫ్రా 9% లాభ పడింది. నేడు కేవలం HDFC బ్యాంక్ 1 % నష్టాన్ని నమోదు చేసి ఏకాకి గా మిగిలింది.

...........................................................................................