- 14-07-2009 :: 8 AM
- మార్కెట్ నాడి
వరుసగా నాలుగు రోజుల నష్టాలను చవిచూసిన మన మార్కెట్లు నేడు కొంత కోలుకునే అవకాశం ఉంది. నేడు ఆసియా మార్కెట్లు కొంత మేరకు లాభాల లో పయనించటం, సింగపూర్ ఆర్ధిక మాంద్యం నుండి బయట పడే అవకాశాలు మెరుగవ్వటం, గత రాత్రి అమెరికా మార్కెట్లు భారి లాభాలను ఆర్జించటం వంటి అంశాలు మన మార్కెట్లను లాభాల బాట లో నడిపిం చెందుకు ఉపకరించ నున్నాయి. పైగా తాజా నివేదిక ప్రకారం చైనా , భారత దేశాల అభివృద్ది గణనీయం గా ఉండబోతున్నదన్న అంశం కూడా విదేశీ సంస్థాగత మదుపరుల లో ,మన మార్కెట్ల పట్ల కొంత విశ్వాసాన్ని కలిగించే అవకాశం ఉంది. పైగా వరుసనష్టాల తరువాత , మన మార్కెట్ల లో ఒక పుల్ బ్యాక్ ర్యాలీ కి కూడా అవకాశం ఉంది కనుక మన మార్కెట్లు కొంతలాభాలను ఆర్జించే అవకాశాలే ఎక్కువ. ఐతే ప్రపంచ బ్యాంకి ఆర్ధిక మాంద్యం మరికొంత కాలం నెలకొని ఉండగలదని విడుదల చేసిన ప్రకటన భల్లూకాలకి ప్రధాన అయూధం గా మరే అవకాశం కూడా లేకపోలేదు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 13400
- అవరోధాలు : 13481- 13886-14040
- మద్దత్తులు : 13386-13051 -12861
...............................................................................................................