13-07-2009 :: 6:20 PM

మార్కెట్ రిపోర్ట్

నేడు మార్కెట్లు ఉదయం నుండి నష్టాల లో పయనించాయి. నేటి మార్కెట్ లో సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 13,400 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 4వేల మార్కుకు దిగువున 3,974 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.77 శాతం, నిఫ్టీ 0.75 శాతం మేరకు క్షీణించాయి.100 పాయింట్లు కోల్పోయి 13,405 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లలో కనిష్ఠంగా 13,220 వద్దకు పడిపోయింది.అయితే మధ్యాహ్న ట్రేడ్‌లో చిన్నస్థాయి కంపెనీల షేర్ల క్రయవిక్రయాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ లాభాల్లోకి ప్రవేశించింది. ఇంట్రాడేలో 240 పాయింట్లు పుంజుకుని 13,462 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది.చివరికి 13,400 వద్ద స్టాక్ మార్కెట్ ముగిసింది.

నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ రంగం 2.84 % క్షీనించ గా , స్మాల్ క్యాప్ రంగం 3.38 % నష్టపోయింది. నేడు బీఎస్ఈ కన్సుమేర్ డురబుల్స్ 5.68 % , రియాల్టీ ఇండెక్స్ , మెటల్స్ 3.77శాతం చొప్పున కోల్పోగా.. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ మాత్రం 1.76 శాతం లాభపడటం విశేషం.

ఇక సెన్సెక్స్ స్టాకు ల వారిగా పరిశీలిస్తే RELIANCE INFRA 6.1 %, JP ASSOCIATES 4.8 % నష్టపోయాయి. నేడు SUN PHARMA 2.6 % , INFOSYS 2.4 % వృద్ధిని నమోదు చేసాయి.

.......................................................................................................