31-07-2009 :: 8 :20 AM

Align Left

మార్కెట్ రిపోర్ట్

నిన్నటి ట్రేడింగ్ తో మరల లాభాల గాడిన పడిన మన మార్కెట్లు నేడు కూడా ఇదే రీతిని కొనసాగించే ప్రయత్నం చేయనున్నాయి. నేడు ఆసియా మార్కెట్లన్నీ మంచి లాభాల తో ట్రేడ్ అవుతున్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు సైతం లాభాలను ఆర్జించటం మన మార్కెట్ల లో నేడు ఉత్సాహం నింపనున్నాయి . ఊహించిన దానికంటే కంపనీలు మంచి ఫలితాలు అందివ్వటం కూడా మార్కెట్ల సెంటిమెంట్ ని మెరుగు పరుస్తున్నాయి.

ఐతే జపాన్ లో నిరుద్యోగ గణాంకాలు గత ఆరు సంవత్సరాల లో గరిష్టం గా నమోదు అవ్వటం పట్ల మార్కెట్లు కొంత ప్రతికూలం గా స్పందించే అవకాశం లేక పోలేదు.

ఋతుపవనాల పట్ల తాజా గా వాతావరణ శాఖ ప్రకటనలు కూడా కొంత నిరాశా పరిచే అంశం. వర్షాభావం వలన ఈ సారి ఆహార ఉత్పత్తి క్షీనించ నున్నట్లు, ఇప్పటి కే రైతులు వర్షాభావ పరిస్థితు లకు అనుగుణం గా కమర్షియల్ పంటలను సాగు చేసే దశ గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని నివేదిక కూడా మార్కెట్ల లో కొంత విస్మయాన్ని కలిగించ వచ్చు. దీని ప్రభావం వలన రానున్న రోజుల లో ఆహార ధాన్యాల ధరలు, తద్వారా టోకు ధరల సూచిక మరియు ద్రవ్యోల్బణం భారిగా పెరిగే అవకాశం ఉంది. ఈ అంశాలు మార్కెట్ల ని కలవర పరచ నున్నాయి.

నేడు వారంతం కనుక నేడు బ్రోకేర్లు కూడా రిస్క్ తీసు కోరు కనుక , నేడు సెన్సెక్స్ సుమారు వంద పాయింట్లు ఇటూ అటు గా పయనించే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15388
  • మద్దత్తులు :15347-15231-15169
  • అవరోధాలు : 15446-15542-15661

  • .