• 30-07-2009 :: 6 :30 pm

  • మార్కెట్ రిపోర్ట్

F & O ముగింపు తో నేడు , ఈ వారం లో మొదటి సారిగా , మన మార్కెట్లు లాభాల తో ముగిసాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 214.50 పాయింట్లు పుంజుకుని 15,388 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 58 పాయింట్లు లాభపడి 4,571 వద్ద ముగిసింది. నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఈ రోజు ఉదయం కూడా 23 పాయింట్ల నష్టంతో 15,149 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. దాదాపు ఉదయం సెషెన్ అంతా స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనించింది. చైనా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. నష్టాల ప్రక్రియలో సెన్సెక్స్ 15,065 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.
ఐతే చైనా సెంట్రల్ బ్యాంక్ , ద్రవ్య విధానం లో వెసులు బాటు కల్పించనున్నదని హామీ ఇవ్వటం తో , చైనా మార్కెట్లు, తద్వారా ఆసియా మార్కెట్లు లాభ పడ్డాయి. దీని తో మన మార్కెట్లు కూడా మధ్యాహ్నపు ట్రేడ్‌లో లాభాల గాడిన పడింది.
దీనికి తోడు ఇన్వెస్టర్లు ఎక్కువగా కొనుగోళ్లపై ఆసక్తిని కనబరచడంతో సెన్సెక్స్ లాభాల బాటలో నడిచింది. నేడు జూలై F & O ముగింపు వలన కూడా మార్కెట్ లో , మా అంచనాలకి అనుగుణం గా , ట్రేడింగ్ చివరి గంట లో షార్ట్ కవేరింగ్ చోటు చేసుకుంది. దీంతో లాభాల ప్రక్రియలో సెన్సెక్స్ 345 పాయింట్లు బలపడి గరిష్ఠంగా 15,410 వద్దకు చేరుకుంది.చివరికి 214 పాయింట్లు లాభంతో స్టాక్ మార్కెట్ ముగిసింది.
నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అయ్యాయి. జూలై 18 తాలూకు ద్రవ్యోల్బణం గణాంకాలు 1.54% ప్రతివృద్ధిని సాధించాయి. గత వారం ఇది - 1.17% గా నమోదు అయ్యింది.
బీఎస్ఈ మధ్యతరహా 29 (0.54 % )పాయింట్లు, చిన్నతరహా కంపెనీల ఇండెక్స్‌లు 49 ( 0.80 % ) పాయింట్లు చొప్పున వృద్ధి చెందాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకెక్స్‌లు 2.5 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ శాతం, పవర్ ఇండెక్స్ శాతం నష్టాలను చవి చూసాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు TCS 6 %, HUL 5.2 % లాభం పడటం విశేషం. కాగా SUN PHARMA 3.6 % , BHEL 1.6 % నష్టపోయాయి.