• 30-07-2009 :: 8 am

  • మార్కెట్ నాడి

నిన్న ఆసియా మార్కెట్లు కుదేలుమనటం తో మన మార్కెట్లు నష్టపోయాయి. నేడు కూడా ఆసియా మార్కెట్లు నష్టాల బాట లో పయనిస్తున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు కూడా ఆద్యంతం నష్టాల లో పయనించింది. ఈ నేపధ్యం లో మన మార్కెట్ల లో BEARS తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే అవకాశం ఉంది. పైగా అంబానీ సోదరుల కలహం కూడా మదుపర్లను కొంత విస్మయం కలిగిస్తోంది. ఈ ప్రభావం ఇప్పటి కే విదేశీ మదుపర్లలో కనవస్తోంది. నిన్న విదేశీ మార్కెట్ల లో రూపాయి క్షీణత కి ఇది కొంత కారణం అని వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశం కూడా మన మార్కెట్ల కి ప్రతికూలం గా ప్రభావం చూపనున్నది.

నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి.

అదే విధం గా SBI , DLF, MNM, SAIL మున్నగు కంపనీలు తమ ఫలితాలను నేడు ప్రక టించ నున్నయి

ఈ కంపనీలు సెన్సెక్స్ ని ప్రభావితం చేసే సత్తా ఉందని ప్రత్యేకం గా చెప్పవలసిన పనిలేదు.

ఐతే, నేడు F & O ముగింపు కనుక నేటి మార్కేట్లని ఇతర అంశాల కంటే, పంటర్లు తామూ చేయ నున్న రోల్ ఓవర్లు మరింత గా ప్రభావితం చేయనున్నాయి కనుక నేటి మార్కెట్ దిశని కేవలం బ్రోకేర్లు, పంటర్లు నిర్ధారించ నున్నారు. ముఖ్యం గా చివరి గంట ట్రేడింగ్ లో వీరు తమ విశ్వరూపం చూపే ఆవకాశం ఉంది కనుక చిన్ని పాటి మదుపర్లు నేడు ట్రేడింగ్ కి దూరం గా ఉండటం మంచిది.

  • .నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15174
  • మద్దత్తులు :15169- 15080-14930 -14888
  • అవరోధాలు : 15347-15542-15661-15814
  • .