చార్టుని పరిశీలిస్తే, గత 18 సంవత్సరాలలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నెల తరువాత 14 సార్లు మార్కెట్ క్షీణించింది అని తెలుస్తుంది. ........................................................................................................................................
మార్కెట్ సమీక్ష
( 29-06-2009 నుండి 03-07-2009)
గడిచిన గత ఐదు రోజులలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకు ల కు లోనయ్యి, చివరకు స్వల్ప లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 1.01 % లాభ పడగా , నిఫ్టీ 1.1 % వృద్ధిని సాధించింది. పి .ఎస్. యు. ఇండెక్స్ అత్యధికం గా 3.8 % ఎగబాకింది. కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ 3.6 % వృద్ధిని నమోదు చేసింది. ఈ వారం ఐ. టి. రంగం అధికం గా 1.4 % నష్టపోగా , టెక్ రంగం 1.3 % కోల్పోయింది. ఈ వారం GAIL 8.22% ,TATA STEEL 7.27%, , ONGC -7.22 %, BPCL 7.19 % వృద్ధిని సాధించాయి. కాగా SUZLON 18.02 %, TATA MOTORS 15.26 % R.COM 6.48 % క్షీణించి నష్టపోయిన వాటాల లో అగ్రస్థానం దక్కించుకున్నాయి.
శుక్ర వారం ప్రవేశ పెట్టిన రైల్ బడ్జెట్ ఈ వారానికి అతి ముఖ్యమైన ఘట్టం గా చెప్పవచ్చు. ఈ బడ్జెట్ వలన రానున్న కాలం లో BEML , TITAGARH WAGON లాభ పడనున్నాయి. రైల్ బడ్జెట్ అంశాల గురించి మార్కెట్ ఫోకస్ పేజిని చూడ గలరు .
గడిచిన ఐదు రోజులలో మార్కెట్ ప్రస్తానం ఈ విధం గా ఉంది
సోమవారం :
సెన్సెక్స్ 21 పాయింట్లు లాభ పడి 14786 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 15 పాయింట్లు లాభ పడి 4391 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం , మార్కెట్లో మిడ్ క్యాప్ రంగం 1.14 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం 1.5 % వృద్ధిని సాధించింది. కన్‌స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ 4 శాతం, రియాల్టీ ఇండెక్స్ 3 శాతం చొప్పున లాభపడ్డాయి.కాగా ఐటీ ఇండెక్స్ మాత్రం 2 శాతం మేరకు క్షీణించింది. నేటి మార్కెట్లో bears మరియు bulls సమ ఉజ్జీలు గా నిలిచాయి .
మంగళ వారం : సెన్సెక్స్ 292 పాయింట్లు కోల్పోయి 14493 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ సుమారు 100 పాయింట్లు కోల్పోయి 4291 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.94 శాతం క్షీణించింది. కాగా స్మాల్ క్యాప్ 2.51 శాతం కోల్పోయింది. ట్రేడింగ్ లో అన్ని రంగాలు నష్టపోయాయి . రియాల్టి రంగం అత్యధికం గా 7.4 శాతం నష్టపోయింది. మెటల్స్ రంగం 3.4 శాతం మెరుపుని కోల్పోయింది
బుధవారం :
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 14,646 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 4,350 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ రంగం 1.01 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం 0.3 % వృద్ధిని సాధించింది. రియాల్టీ ఇండెక్స్ 4.5, టెక్ 1.56 శాతం చొప్పున లాభపడ్డాయి.కాగా కన్‌స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ మాత్రం 0.15 శాతం మేరకు క్షీణించింది.
గురువారం :
గురువారం తీవ్ర మైన ఒడిదుడుకులకు లోనయి , మార్కెట్లు చివరకు ఫ్లాట్ గా ముగిసాయి. సెన్సెక్స్ 13 పాయింట్లు లాభ పడి 14658 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 8 పాయింట్లు లాభ పడి 4348 పాయింట్లు నమోదు చేస్తూ ఫ్లాట్ గా ముగిసింది.
గురువారం రోజున లోక సభ లో , నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించారు
గురువారం ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదల అయ్యాయి. జూన్ 20తో ముగిసిన వారానికి ద్రవ్యోల్భణం కొంత మేర పెరిగింది. అయిన కూడా ఇంకా మైనస్ లోనే ఉంది. ఈ సారి ద్రవ్యోల్బణం -1.30గా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి ద్రవ్యోల్బణం 11.8 గా నమోదయ్యింది. ఆయిల్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన లో కిరోసీన్, గ్యాస్ లో నెలకొని వున్న వసూళ్ళ లో వెలితి ని నిక్షేపాలను వెలికి తీసే కంపనీ లు భరించ బోవని స్పష్టం చేయటం తో ONGC, GAIL స్టాకు లు భారి గా లాభ పడ్డాయి. మిడ్ క్యాప్ ఇండేక్స్ 0.33 % లాభ పడగా , స్మాల్ క్యాప్ 0.74 % వృద్ధి ని నమోదు చేసింది. నేడు మెటల్స్ రంగం 3.26 %, పి. యస్. యు రంగం 1.95 % వృద్ధి చెందగా , క్యాపిటల్ గూడ్స్ 1.01 % , ఆటో 0.91 % క్షీణించాయి
శుక్రవారం :
సెన్సెక్స్ 255 పాయింట్లు వృద్ధి చెంది 14,913 వద్ద స్థిరపడింది.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా లాభాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 75 పాయింట్లు పుంజుకొని 4424 వద్ద నిలిచింది. మార్కెట్ లో బ్యాంకింగ్ ఇండెక్స్ 2.19 % వృద్ధి చెందగా , క్యాపిటల్ గూడ్స్ 1.90 % వృద్ధిని నమోదు చేసింది.మార్కెట్ లో అన్ని రంగాల పై bulls పట్టు సాధించటం విశేషం.
మార్కెట్ పై ప్రధాన బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతుందో, వచ్చే వారం మార్కెట్లు ఎలా ట్రేడ్ అవ్వనున్నాయో తెలుసుకునేందుకు రేపు మేము ప్రచురించ బోయే " మార్కెట్ ముందు చూపు " శీర్షిక ని చదవండి.
.........................................................................................