...............................................................................................................
- మార్కెట్ ముందు చూపు
(06-07-2009 నుండి 10-07-2009 )
బడ్జెట్ 2009 -10 ముందస్తు అంచనాలు
- వాస్తవ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 6%
- ఇన్ఫ్రా కి చేయూత
- విద్య , నైపుణ్య గురించి బడ్జెట్ కేటాయింపులు కొనసాగింపు
- ప్రైవేటి కరణ విషయం లో ఆచి తూచి ముందడుగు
బడ్జెట్ లోటు ఎంత ?
బడ్జెట్ లోటు సుమారు 6 % వరకు ఉండవచ్చు. ఇంత కంటే ఎక్కువగా ఉంటే విదేశీ పెట్టుపడులు మందగించే అవకాశం ఉన్నందున బడ్జెట్ లోటు ని 6 % కి నియంత్రించవచ్చు. బడ్జెట్ లోటు 6% కంటే తక్కువగా ఉంటే భారత్ నిర్మాణ్, గ్రామీణ ఉపాధి పధకాలకి నిధులు సమకూరటం కష్టం.
మౌలిక సదుపాయాల రంగం ( ఇన్ఫ్రా ) కి ప్రాముఖ్యత
భవిష్యత్ లో రెండంకెల GDP వృద్ధిని సాధించాలంటే ఇన్ఫ్రా రంగానికి చేయూత ఇవ్వ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రోడ్ల వ్యవస్థ కఠిన పరిస్థితి లో ఉంది. ఆశించినంత గా ప్రైవేటు రంగ భాగస్వామ్యం ఇందు లో ఇప్పటి వరకు చోటు చేసుకో లేదు కాబట్టి ప్రభుత్వం ఈ దశ గా చర్య చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
బహుశా బడ్జెట్ లో ఇన్ఫ్రా రంగం లో ప్రైవేటు పెట్టు పడుల విషయం లో జరిగే రుణ ప్రయత్నం లో ప్రభుత్వం కొంత మేరకు బ్యాంకులకు గ్యారంటీ గా వ్యవహరించవచ్చు. ఇందుకు గాను SPVS ( SPECIAL PURPOSE VEHICLE) లు వినియోగించ వచ్చు. ఇందుకు గాను బడ్జెట్ లోను, కాకుంటే బడ్జెటేతర మార్గం లో నిధులు సమకూరే దిశ గా వ్యవహరించే అవకాశం.
వడ్డీ లో కుదింపు ?
ఇప్పటికే ఇంధన ధరలు పెరిగినందున ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. వడ్డీ రేటు తగ్గిస్తే, మార్కెట్ లో మరింత దానం చలామణి లో ఉంటుంది. అప్పుడు ద్రవ్యోల్బణం మరింత గా పెరిగే అవకాశం ఉన్నందున ఈ బడ్జెట్ లో వడ్డీ రేటు ని తగ్గించే అంశాలు కనపడక పోవచ్చు. కాబట్టి పెట్టుపడులకు ధనం అంత సులభం గా దొరికే అవకాశం ఉండకపోవచ్చు.
బడ్జెట్ లోటు భర్తీ ఇలా జరిగే అవకాశం ..
ఆర్ధిక సంస్కరణల అమలు చేయటం, అంటే ప్రభుత్వ రంగ సంస్థల లో ప్రభుత్వం వాటాలను అమ్మివేయటం వంటి చర్యల దిశ గా బడ్జెట్ లో ప్రస్తావన జరగ వచ్చు. OIL INDIA, NHPC, AIR INDIA, COAL INDIA, BSNL వంటి అగ్రగామి సంస్థల కు చెందిన ప్రభుత్వ వాటాలను విక్రయించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని బడ్జెట్ ఖర్చులకి వినియోగించే అవకాశం ఉంది. వీటి వాటా ల లో కొంత అమ్మినా గాని సుమారు 35000 కోట్ల ( 65 ~70 BILLION US D ) మేరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కనీసం 25000 కోట్ల రూపాయల ఆదాయాని సమకూర్చుకోవాలని ప్రధాన మంత్రి ఆలోచన. NHPC అమ్మకం ద్వారా 1854 కోట్ల రూపాయలు సమకూర్చు కునే అవకాశం ఉంది. ఏ కంపని లో ఎంత పెట్టుపడి వున్నది, అమ్మితే ఎంత వచ్చేది అన్నవిషయం గురించి స్థల భావం వలన " ఈక్విటీ" పేజి లో విపులం గా చర్చించాము. దీని గురించి " ఈక్విటీ" పేజి ని తప్పక చూడగలరు. ప్రభుత్వ వాటా ని పూర్తి గా అమ్మివేస్తే సుమారు $ 150 BILLION ఆర్జించవచ్చు. ఐతే ఇది జరిగేందుకు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు .
వ్యవసాయ రంగానికి పెద్ద పీట
మునుపెన్నడూ లేని విధంగా , ఈ సారి తొలిసారి గా , ఆర్ధిక మంత్రి బడ్జెట్ ముందస్తు చర్చలకి రైతుల తో ముఖాముఖి చర్చించటం గమనార్హం. దీనిని బట్టి ఈ సారి వ్యవసాయ రంగానికి భారి ఊపుని తీసుకొచ్చే ప్రయత్నం , ప్రభుత్వం చేయనున్నది. దీని లో భాగం గా ప్రభుత్వం మరొక సారి
- వ్యవసాయ రుణాల మాఫీ చేయవచ్చు.
- వ్యవసాయ సబ్సిడీ లో పెంపుదల
- స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు పరచటం
పరిజ్ఞానం పెంచేందుకు కృషి
- R & D కి , విద్య కి చేయూత .అందు లో భాగం గా NATIONAL SKILL DEVELOPMENT CORPORATION నకు మరిన్ని నిధులు.
- వైజ్ఞానిక రీసెర్చ్ లో ప్రస్తుతం ఉన్న 150 % weighted మినహా యింపు ఇతర రంగాలకు సైతం విస్తరణ.
సబ్సిడీ భారం ఎందు లో ?
- పెట్రోల్ , డిజిల్ లో ధరల నియంత్రణ లు తొలగింపు గా చర్యలు చేపట్ట వచ్చు.
- కేరోసిన్ , వంట గ్యాస్ పై సబ్సిడీ కొనసాగింపు.
- ఎరువుల పై సబ్సిడీ పై గరిష్ట పరిమితి ని నెల కొల్పే అవకాశం. ఎరువులో వున్నా నత్రజని మున్నగు పదార్థాల వారి గా సబ్సిడీ క్రమ బద్ధికరణ
బడ్జెట్ లో లాభ పడే రంగాలు ఏవి ?
- వ్యవసాయం
- విద్య
- వ్యవసాయ పనిముట్లు
- ప్రభుత్వ రంగ సంస్థలు .
ఈ రంగాలకి చెందిన స్టాకులు లాభ పొందే అవకాశం ఉంది.
నష్టపోయే స్టాకులు ?
సెన్సెక్స్ ఇప్పటి కే ఆదాయానికి 21 రెట్ల విలువతో ట్రేడ్ అవుతున్నాయి. 2010 ఆదాయానికి ఇది 17 x. ఇతర ఆసియా మార్కెట్ల తో పోల్చి చూస్తె మన మార్కెట్లు చాలా ప్రియం అని చేపవచ్చు. కాబట్టి త్వరలో మార్కెట్లు correction నకు లోనుకానున్నాయి. ఇందు చేత సెన్సెక్స్ heavy weights జోలికి వెళ్ళకుండా ఉండటం క్షేమం.
బడ్జెట్ తరువాత మార్కెట్ ఎలా ఉంటుంది ?
మార్కెట్ లో మెగా PSU IPO ల వెల్లువ వచ్చే అవకాశం ఉంది. ప్రైమరీ మార్కెట్ , పెట్టుపడులను మ్రింగి వేయనున్నది. అంటే సెకండరీ మార్కెట్ లో కొనుగోళ్ళ కి పెద్ద గా ధనం ఉండక పోవచ్చు.
టెక్నికల్ గా సెన్సెక్స్ కి 14930, 15162 , 15542 , 15661 పాయింట్ల వద్ద అతి బలమైన అవరోధం ఉంది. బడ్జెట్ లో భారి గా మార్కెట్లకు అనుకూలించే విధం గా ప్రతిపాదనలు ఉంటే నే ఈ అవరోధాన్ని చేదించగలదు. మార్కెట్లకి 14518, 14240 , 14004 పాయింట్లు అతి కీలక మద్దత్తు స్థాయిలు. బడ్జెట్ ప్రతిపాదనల పై మార్కెట్ పయనం ఆధార పడి ఉన్నది. రానున్న కాలం లో మార్కెట్ కిందకి జారుకునే అవకాశాలు ఎక్కువ అని మనకి చరిత్ర చెబుతోంది.