03-07-2009 :: 6:45PM

మార్కెట్ రిపోర్ట్

నేడు మన మార్కెట్లులాభాలు గడించాయి . ఉదయం ఆసియా, అమెరికా మార్కెట్‌‍ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో 105 పాయింట్ల పతనమై 14,553 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాసేపటికే 14,500 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అనంతరం బీఎస్ఈ సూచి క్రమక్రమంగా పుంజుకుంది. నేటి రైల్ బడ్జెట్ లో జనాకర్శ పధకాలు చోటుచేసుకున్నా , మార్కెట్లకి ప్రతికూలం గాలేనందున మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. ఐతే మధ్యాన్నం తాజా ట్రేడ్ లో , వారంతం వలన మార్కెట్ లో షార్ట్ కవెరింగ్ చోటు చేసుకోవటం తో మార్కెట్లు లాభ పడ్డాయి. దీనికి తోడూ గా కేంద్ర బడ్జెట్ నుంచి ఆశాజనక సంకేతాలు రావడంతో ఒకానొక దశలో కనిష్ట స్థాయి నుంచి 446 పాయింట్లు వృద్ధి చెంది 14,946 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు వృద్ధి చెంది 14,913 వద్ద స్థిరపడింది.ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు లాభాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 75 పాయింట్లు పుంజుకొని 4424 వద్ద నిలిచింది.

నేటి మార్కెట్ లో బ్యాంకింగ్ ఇండెక్స్ 2.19 % వృద్ధి చెందగా , క్యాపిటల్ గూడ్స్ 1.90 % వృద్ధిని నేడు నమోదు చేసింది.నేటి మార్కెట్ లో అన్ని రంగాల పై bulls పట్టు సాధించటం విశేషం .నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ రంగం 0.83 % , స్మాల్ క్యాప్ రంగం 0.43 % వృద్ధిని నమోదు చేసాయి. సెన్సెక్స్ స్టాకు ల లో HDFC 7.7 % , TATA STEEL 4.3% ఎగబాకాయి. కాగా HEROHONDA 1.1% , HINDALCO 1 % కుంగిపోయాయి.

...........................................................................................................