• మార్కెట్ ముందు చూపు
  • (13-07-2009 నుండి 18-07-2009 )

ఈ వారం మార్కెట్లు అతి కీలక దశ లో ప్రవేశించాయి. సుస్థిర ప్రభుత్వం , ఆర్ధిక సంస్కరణలు అనే కైపు తో పైకెగసిన మార్కెట్లు వాస్తవ పరిస్థితులను ఎట్టకేలకు గ్రహిస్తున్నాయి. గత శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపరులు జరిపిన అమ్మకాలు మన మార్కెట్ల కి అతి కీలక మద్దత్తు స్థాయిలను నేలకూల్చాయి. ఐతే శుక్రవారం రిలయన్స్ గ్రూప్ భారి గా నష్టపోయింది. ఈ వారం ఈ నష్టాలు ఇతర సెన్సెక్స్ స్టాకు లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యం గా విదేశీ మదుపరులను ఇంతవరకు ఆకర్షించిన స్టాకు లు ఇప్పుడు నష్టాలను చవి చూసే అవకాశం ఉంది.

ఐతే ఎన్నికల ఫలితాలనంతరం మార్కెట్లు రివ్వున ఎగబాకినప్పుడు , మార్కెట్ ర్యాలీ లో పాలు పంచుకోలేక పోయిన మదుపరులు , దేశ వాలి సంస్థలు ఇప్పుడు కొంత కొనుగోళ్ళు చేసే అవకాశం ఉంది. కనుక మార్కెట్లు ఈ వారం మధ్య లో కొంత స్థిరత్వం పొందే అవకాశం ఉంది. ఇందుకు గాను మంగళ వారం రాత్రి అమెరికా లో విడుదల కానున్న రిటైల్ అమ్మకాల గణాంకాలు కొంత ఉపకరించవచ్చు. ఈ గణాంకాలు ఆశాజనకం గా ఉంటే మన మార్కెట్లు బుధ -గురు వారాల నుండి కొంత నిలకడ సాధించ వచ్చు. అదే విధం గా , జి- 8 సమావేశాలలో అమెరికా డాలర్ పెత్తనాన్ని సహించేది లేదని చైనా, భారత , రష్యా దేశాలు గళం విప్పుతున్నాయి. currency / forex వర్తకులకి, ఐ. టి. సంస్థలకి ఈ అంశం కీలకం.
ఇక దేశ ఆర్ధిక పరిస్థి ని పరిశీలిస్తే, రిజర్వు బ్యాంకు వడ్డీ తగ్గింపు పై చేయబోయే ప్రకటన మన మార్కెట్లకి కీలకం కానున్నాయి. ఈ వారం రంగాల వారిగా వాటాల లో కొంత సంచలనం కనిపించ వచ్చు. ఫర్టిలైజేర్స్ సబ్సిడీ విధానం గురించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే విధం గా బడ్జెట్ అంశాల పై మరి కొంత స్పష్టత కలిగించే అంశాలు కూడా మార్కెట్లను , తత్సంబంధిత వాటాలను ప్రభావితం చేయనున్నాయి. మార్కెట్లను , ఋతుపవనాల మందగమనం, "el- nino" పై వాతావరణ శాఖ ప్రకటనలు " పరేషాన్" చేసే అవకాశం ఉంది. గురువారం ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా కీలకం.
టెక్నికల్ గా పరిశీలిస్తే, సెన్సెక్స్ అతి కీలక 14004 మద్దత్తు స్థాయి కోల్పోయింది కనుక, ఇక ఈ స్థాయే అతి కీలక అవరోధం కానున్నది. 13768 - 14040-14243-14534 స్థాయిలు మార్కెట్ కి అవరోధాలు . చార్టు ల లో head and shoulders pattern కనవస్తున్నందున 13386 మజిలీ అతి కీలక మద్దత్తు స్థాయి . సోమవారానికి గాను 13481 పాయింట్ల మద్దత్తు స్థాయి గమనించ తగినది. ఈ వారానికి 13051 -12861-12605 స్థాయిలు 13386 స్థాయి కంటే దిగువన ఉన్న చెప్పుకోదగ్గ స్థాయిలు. ఈ మద్దత్తులు నిలబడితే బుధవారం నుండి మార్కెట్లు కోలుకునే అవకాశం ఉంది.
................................................................................................................