11-07-2009
మార్కెట్ సమీక్ష
( 06-07-2009 నుండి 10-07-2009)
గడిచిన బడ్జెట్ వారం లో మార్కెట్లు భారిగా పతనమయ్యాయి. ఈ వారం ప్రారంభం కి 14913 పాయింట్ల వద్దనున్న సెన్సెక్స్ 7.9 % నష్టపోయి పాయింట్ల 13504 వద్ద ముగిసింది . నిఫ్టీ లో క్షీణత మరీ అధికం గా కనిపించింది. నిఫ్టీ 4424 పాయింట్ల నుండి 4004 పాయింట్లవరకు దిగజారి 9.5 % క్షీణత ని నమోదు చేసింది. ఎన్నికల ఫలితాల వెలువడిన తరువాత , అంటే, మే 18 తరువాత ఇంత కనిష్ట స్థాయి మార్కెట్లు నమోదు చేయటం ఇదే ప్రథమం.
సోమవారం బడ్జెట్, గురువారం ద్రవ్యోల్బణ గణాంకాలు, శుక్రవారం విడుదలైన IIP గణాంకాలు గత వారం లోని హై లైట్స్ . రోజు వారి గా మార్కెట్ గమనం ఈ విధం గా ఉండింది.
సోమవారం :
పార్లమెంటు లో ఆర్ధిక మంత్రి ప్రవేశ పెట్టి న బడ్జెట్ మార్కెట్ ని పూర్తి గా విస్మయ పరిచింది. ఆర్థిక సంస్కరణలు చేపట్టవచ్చన్న అంచనాల తో మార్కెట్ నేటి ఉదయం లాభాల తో ప్రారంభమయ్యింది. నేడు సెన్సెక్స్ గరిష్టం గా 15097 పాయింట్ల కు చేరుకుంది. ఐతే ఆర్ధిక మంత్రి తమ బడ్జెట్ లోటు ని GDP లో 6.78 % గా సూచించటం తో మార్కెట్లు భారి గా క్షీణించాయి. . నిరుత్సాహ వాతావరణం లో సెన్సెక్స్ ఒకానొక దశ లో క్షీణించి 14 వేల పాయింట్ల కంటే తక్కువ గా పడిపోయి కనిష్టం గా 13959 పాయింట్లకు చేరుకుంది. చివరకు 869 పాయింట్ల నష్టాల తో 14043 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 259 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ 4166 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ లో స్మాల్ క్యాప్ రంగం 4.5% , మిడ్ క్యాప్ 1.7 % కృంగి పోయాయి.
మంగళ వారం :
మార్కెట్లు అంచలు అంచలు గా పయనం సాగించి లాభాల లో ముగిసింది. మంగళవారం నాడు సెన్సెక్స్ 14170 పాయింట్ల వద్ద, 127 పాయింట్ల లాభాలను నమోదు చేస్తూ ముగిసింది. కాగా నిఫ్టీ 36 పాయింట్ల వృద్ధి చెంది 4202 పాయింట్ల వద్ద ముగిసింది.మిడ్ క్యాప్ 1.01 % లాభాలను ఆర్జించాయి. కాగా స్మాల్ క్యాప్ స్టాకు లు ౦.20 % నష్టాలను చవిచూసాయి
బుధవారం :
సెన్సెక్స్ 401 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ 13769 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 123 పాయింట్లు నష్ట పోయి 4078 పాయింట్ల వద్ద ముగిసింది. వాణిజ్య మంత్రి ఎగుమతులు 29 % క్షీణించాయని చేసిన ప్రకటన మన మార్కెట్లను కోలుకోలేని దెబ్బ తీసింది.ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ ప్రక్రియలో 14వేల మార్కు దిగువకు పడిపోయి 13,701 వద్దకు సెన్సెక్స్ చేరుకుంది.మధ్యాహ్న ప్రారంభ ట్రేడ్‌లో సెన్సెక్స్ మరింతగా క్షీణించింది. చివరికి సెన్సెక్స్ 2.83 శాతం, నిఫ్టీ 2.93 శాతం మేరకు క్షీణించాయి. నాటి ట్రేడింగ్ లో మార్కెట్ లో అన్ని రంగాలు నష్టాలను నమోదు చేసాయి . మిడ్ క్యాప్ రంగం 3.66% క్షీనించ గా , స్మాల్ క్యాప్ రంగం 3.73 % క్షీణించింది
గురువారం :
మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యి చివరకు ఫ్లాట్ గా ముగిసాయి. మార్కెట్ లో సెన్సెక్స్ 11 పాయింట్లు కోల్పోయి 13757 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 2 పాయింట్ల లాభం తో 4081 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం ఉదయం 13796 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటినుండి దిశా హీనం గా పయనం సాగించింది.
జూన్ 27 కు సంబంధించిన ద్రవ్యోల్బణ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి ద్రవ్యోల్బణం 1.55 శాతం ప్రతి వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి పప్పు దినుసులూ 16.7 %, ఆహార ధాన్యాలు 12 .2 % ధరలు పెరిగినా , ద్రవ్యోల్బణ ప్రతి వృద్ధి కి కారణం నిరుడు ఇదే సమయానికి ద్రవ్యోల్బణం 12.3 % గరిష్ట స్థాయిలో ఉండింది. ఈ " base effect" కారణం గా ద్రవ్యోల్బణం తగ్గినట్లు సూచించ బడుతోంది. గురువారపు ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.58 % లాభాలను ఆర్జించగా , స్మాల్ క్యాప్ రంగం మాత్రం 0.14 % స్వల్ప నష్టాలను నమోదు చేసింది.
శుక్రవారం :
శుక్రవారపు ట్రేడింగ్ లో మార్కెట్లు ఉదయం నుండి దిశాహీనం గా పయనిస్తూ చివరి అరగంట లో భారి గా నష్టపోయాయి. సెన్సెక్స్ 253 పాయింట్లు కోల్పోయి 13504 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 4004 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఏజెన్సీ " మూడి " బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తూ జారీచేసిన ప్రకటన వలన మన మార్కెట్ల లో వచ్చే విదేశీ పెట్టుపడులు తీవ్రం గా ప్రభావితం కానున్నాయి. ఐతే " మూడి " భారత మార్కెట్ల కి bbb- rating నే కొనసాగించటం కొంత ఊరట కలిగించే విషయం. తాజా ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.92 % నష్టపోగా, స్మాల్ క్యాప్ రంగం 1.79 % క్షీణించింది. Infosys మెరుగైన ఫలితాలను అందివ్వటం తో ఐ.టి రంగం మాత్రం లాభాల లో పయనించింది.

ఈ వారం రియాల్టీ రంగం 17 .2 % నష్టపోగా, బ్యాంకింగ్ రంగం 13.5% క్షీణించింది. కేవలం FMCG రంగం మార్త్రం లాభాలను ఆర్జించింది. ఈ రంగం 4 .2 % వృద్ధి ని సాధించటం విశేషం.

ఇక స్టాకు ల వారి గా పరిశీలిస్తే ఈ వారం SUZLON ENERGY 20.42 %, MTNL 18.28 %, RELIANCE ENERGY 17.34 %, TATASTEEL 16.41 %, R.COM మరియు STERLITE సుమారు 15.6 % , HCL ,ICICI ,SEIMENS 11 ~ 13 % వరకు క్షీణించాయి.

కాగా ITC 8.43 %, HERO HONDA 5.79 %, AMBUJA CEMENTS 4.49 %, RANBAXY , MAHINDRA 3.39 % చొప్పున లాభాలను ఆర్జించిన వాటాలు గా నిలిచాయి.

వచ్చే వారం మార్కెట్ ట్రేడింగ్ పై టెక్నికల్ అనాలిసిస్ రేపటి " మార్కెట్ ముందుచూపు " శీర్షిక లో మీకు అందించ నున్నాము.

............................................................................................................