• 10-07-2009:: 8 am

  • మార్కెట్ నాడి

గత నాలుగు రోజులు గా మన మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. కారణం గా సంస్థాగత మదుపరులు, బ్యాంకులు , బాండ్ మార్కెట్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది ఈక్విటీ మార్కెట్ కి ప్రతికూల అంశం. నేడు వారంతం కనుక మార్కెట్ చివరి అరగంట లో తప్ప , బహుశా నేడు కూడా మార్కెట్లు దిశా హీనం గా సంచరించే అవకాశం ఉంది. నేటి ఆసియా మార్కెట్లు కూడా ఇదే విధం గా సంచరించటం సందర్భం లో గమనార్హం. ఇటలి దేశం లో ప్రస్తుతం జరగుతున్న G-8 సమావేశాల లో నాయకులు ఆర్ధిక మాంద్యం గురించి తీసుకుబోయే చర్యల గురించి చేయబోయే ప్రకటనలు కూడా మన మార్కెట్లను కొంత వరకు ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు .

NTPC, BEML సంస్థలపై CAG నివేదిక కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. CAG కథనం ప్రకారం ఈ రెండు సంస్థలు కూడా " సత్యం " తరహా లో , నిరుడు లాభాలను వాస్తవాల కంటే ఎక్కువగా ప్రకటిం చాయని తెలుస్తోంది. ఐతే ఇది మరీ అంత ప్రమాదకరం గా ఉండబోదని మా అంచనా .
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 13757
  • అవరోధాలు : 13886-14040-14243
  • మద్దత్తులు : 13635-13518--13349

...........................................................................................................