• 10-07-2009 :: 4:45 PM

  • మార్కెట్ రిపోర్ట్

నేడు మార్కెట్లు మేము సూచించిన విధం గా తూచా తప్పకుండా నడుచుకున్నాయి. నేడు మార్కెట్లు ఉదయం నుండి దిశాహీనం గా పయనిస్తూ , మేము ముందుగానే హెచ్చరించి నట్లు చివరి అరగంట లో నే పతనం కావటం విశేషం.
నేడు సెన్సెక్స్ 253 పాయింట్లు కోల్పోయి 13504 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది కూడా మేము సూచించిన మద్దత్తు స్థాయి ఐన 13518 పాయింట్ల కి అతిసమీపం అని గుర్తించాలి. నిఫ్టీ నేడు నాలుగు వేల పాయింట్లు దిగజారకుండా , 4004 పాయింట్ల వద్ద ముగిసి కొంత మానసిక ఓదార్పు నిచ్చింది. ఐతే ఈ ప్రక్రియ లో నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయింది.
నేడు ఐరోపా మార్కెట్లలో ఆయిల్ స్టాకులు " చేవ్రోన్" కంపెనీ ప్రకటన వలన భారి నష్టాల తో ప్రారంభమయ్యే సరికి మన మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. అంతే కాక అంతర్జాతీయ ఏజెన్సీ " మూడి " బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తూ నేడు జారీచేసిన ప్రకటన వలన మన మార్కెట్ల లో వచ్చే విదేశీ పెట్టుపడులు తీవ్రం గా ప్రభావితం కానున్నాయి. ఐతే " మూడి " భారత మార్కెట్ల కి bbb- rating నే కొనసాగించటం కొంత ఊరట కలిగించే విషయం. ఈ కారణాలకి , వారాంతం కూడా తోడవ్వటం తో నేడు భల్లూకలకి ( BEARS ) అడ్డు లేకుండా పోయింది.
నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ రంగం 1.92 % నష్టపోగా, స్మాల్ క్యాప్ రంగం 1.79 % క్షీణించింది.
నేడు ఆయిల్ మరియు గ్యాస్ రంగం 3.28 % నష్టపోగా , పవర్ రంగానికి 2.54% వోల్టేజ్ తగ్గింది. నేటి మార్కెట్ లో Infosys మెరుగైన ఫలితాలను అందివ్వటం తో ఐ.టి రంగం మాత్రం లాభాల లో పయనించింది.
స్టాకుల వారిగా పరిశీలిస్తే నేటి సెన్సెక్స్ స్టాకు ల లో wipro 3.37 % , infosys 2.97 % వృద్ధి చెందాయి. కాగా Reliance Infra 6.50% , Jai prakaash associates 5.62 % అధికంగా క్షీణించిన సెన్సెక్స్ స్టాకు లు గా నిలిచాయి.
గత ఐదు రోజుల గురంచి విశ్లేషణ తో పాటు ఇతర బిజినెస్ వార్త ల గురించి రేపు మా వెబ్సైటు లో వివరాలు పొందవచ్చు. వచ్చే వారం మార్కెట్ తీరుతెన్నులు ఏ విధం గా ఉండనున్నదో తెలుసుకునేందుకు ఈ ఆదివారం " మార్కెట్ ముందుచూపు " శీర్షిక ద్వారా తెలుసుకోవచ్చు
.......................................................................................................