09-07-2009
మార్కెట్ రిపోర్ట్
నేడు మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యి చివరకు ఫ్లాట్ గా ముగిసాయి. నేటి మార్కెట్ లో సెన్సెక్స్ 11 పాయింట్లు కోల్పోయి 13757 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 2 పాయింట్ల లాభం తో 4081 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ఉదయం 13796 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటినుండి దిశా హీనం గా పయనం సాగించింది. ఒక దశ లో 13644 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరిన సెన్సెక్స్ , కోలుకోని 13879 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు చేరుకుంది .ఈ రెండు స్థాయి లు మేము ఉదయమే సూచించిన కీలక మజిలీలకి అత్యంత సమీపం గా ఉండటం గమనార్హం.
ఇది ఇలా ఉండగా , నేడు జూన్ 27 కు సంబంధించిన ద్రవ్యోల్బణ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఈ సారి ద్రవ్యోల్బణం 1.55 శాతం ప్రతి వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి పప్పు దినుసులూ 16.7 %, ఆహార ధాన్యాలు 12 .2 % ధరలు పెరిగినా , ద్రవ్యోల్బణ ప్రతి వృద్ధి కి కారణం నిరుడు ఇదే సమయానికి ద్రవ్యోల్బణం 12.3 % గరిష్ట స్థాయిలో ఉండింది. ఈ " base effect" కారణం గా ద్రవ్యోల్బణం తగ్గినట్లు సూచించ బడుతోంది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.58 % లాభాలను ఆర్జించగా , స్మాల్ క్యాప్ రంగం మాత్రం 0.14 % స్వల్ప నష్టాలను నమోదు చేసింది.
నేడు మెటల్స్ రంగం అత్యధికం గా 1.53 % లాభాలను ఆర్జించగా హెల్త్ కేర్ రంగం 1.05 % వృద్ధిని సాధించింది. కాగా కన్సుమేర్ డ్యురాబుల్స్ 1.43 %, క్యాపిటల్ గూడ్స్ 1.07 % క్షీణించాయి
ఇక సెన్సెక్స్ స్టాకులు వారిగా పరిశీలిస్తే రిలయన్స్ Industries 1.26 % లాభాన్ని నమోదు చేసింది. కాగా Tata Motors 3.15%, Icici Bank 2.77% నష్టాన్నినమోదు చేసాయి.
......................................................................................