09-07-2009 :: 8AM
మార్కెట్ నాడి
" ఎగదీస్తే బ్రహ్మత్య , దిగతీస్తే గో హత్య " వైనం గా మన మార్కెట్లు గత మూడు రోజులు గా పయనిస్తున్నాయి. నిన్న సెన్సెక్స్ దిగజారి 14040 పాయింట్ల మద్దత్తు కోల్పోవటం శోచనీయం. ఇప్పుడు సెన్సెక్స్ నకు కీలక మద్దత్తు గా 13518 పాయింట్లని చెప్పవచ్చు. గత రాత్రి IMF , 2010 కి గాను విడుదల చేసిన అంచనాలు ఆశా జనకం గా ఉండటం వలన మన మార్కెట్లకి నేడు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. IMF అంచనాల ప్రకారం 2010 కల్లా ఆర్ధిక మాంద్యం తగ్గుముఖం పట్టనున్నట్టు ప్రకటించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ 2010 నకు 2.5 % వృద్ధి చెందే సూచనలు కనిపిస్తోందని IMF రిపోర్ట్ ని విడుదల చేసింది. గతం లో ఇది 1.9 % గా ఉంటుందని అంచనాలు వేసారు. ఈ రిపోర్ట్ ప్రభావం వలన ప్రపంచ మార్కెట్లు కొంత నిలకడ గా పయనిస్తున్నాయి. మన మార్కెట్లు కూడా నేడు కొంత నిలకడ ని సాధించ వచ్చు.
ఐతే , నేడు ద్రవ్యోల్బన గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ గణాంకాల ఫలితాలు మన మార్కెట్ దిశ ని నిర్దేశించ వచ్చు. ఇవి నిరాశాజనకం గా ఉంటే మాత్రం , మార్కెట్లకు మరొక సారి ఆటు పోట్లు తప్పవు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 13769 ( సమీప మజిలి 13781)
- అవరోధాలు : 13886-14040-14243
- మద్దత్తులు : 13635-13518--13349
...........................................................................................................