08-07-2009 :: 6:30 pm

మార్కెట్ రిపోర్ట్

నేడు మన మార్కెట్లు మరొక సారి జారుడు బండ ని తలపిస్తూ క్రిందకి జారాయి. నేడు సెన్సెక్స్ 401 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ 13769 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మేము సూచించిన మద్దత్తు స్థాయి 13781 పాయింట్ల కి అతి చేరువ లో ఉండటం విశేషం. నేడు సెన్సెక్స్ సోదరుడైన నిఫ్టీ 123 పాయింట్లు నష్ట పోయి 4078 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి మార్కెట్ లో ఉదయం 130 పాయింట్ల నష్టంతో 14,039 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.అమెరికా మార్కెట్ల ప్రభావాన ఆసియాలోని ప్రధాన మార్కెట్ల కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా విక్రయాల ఒత్తిడి నడుమ నష్టాలతో ప్రారంభమయ్యాయి. వాణిజ్య మంత్రి ఎగుమతులు 29 % క్షీణించాయని చేసిన ప్రకటన మన మార్కెట్లను కోలుకోలేని దెబ్బ తీసింది.ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ ప్రక్రియలో 14వేల మార్కు దిగువకు పడిపోయి 13,701 వద్దకు సెన్సెక్స్ చేరుకుంది.అలా స్టాక్ మార్కెట్.. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే వరకు రెడ్ మార్కులోనే పయనించింది. మధ్యాహ్న ప్రారంభ ట్రేడ్‌లో సెన్సెక్స్ మరింతగా క్షీణించింది. చివరికి సెన్సెక్స్ 2.83 శాతం, నిఫ్టీ 2.93 శాతం మేరకు క్షీణించాయి.

నేటి మార్కెట్ లో అన్ని రంగాలు నష్టాలను నమోదు చేసాయి . సెక్టోరల్ ఇండెక్స్‌లలో రియాల్టీ ఇండెక్స్ 9 శాతం అత్యధికంగా క్షీణించగా.. కన్‌స్యూమర్ గూడ్స్, మెటల్, బ్యాంకెక్స్, విద్యుత్, కన్‌స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఆ తర్వాతి స్థానాల్లో నష్టాలను చవిచూశాయి.

నేడు మిడ్ క్యాప్ రంగం 3.66% క్షీనించ గా , స్మాల్ క్యాప్ రంగం 3.73 % క్షీణించింది

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు Tata Steel 8.9 % , sterlite 8.4 % తమ మెరుపుని కోల్పోయాయి. కాగా Acc 3.1 % , Maruthi 2.1 % లాభ పడి కొంత ఉపశమనం కలిగించాయి.

..................................................................................................